ఇక సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన పోలీసులే దారి తప్పుతున్నారు.. పోలీసులు ఒక్కోసారి చేసే తప్పులు యావత్ పోలీసుశాఖకే చాలా చెడ్డపేరు తీసుకువస్తాయి.మహిళలకు సరైన రక్షణ కల్పించాల్సిన పోలీసులే.. మహిళ కోసం కొట్టుకోవడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇక ఓ కోక తెచ్చిన గొడవ ఆ పోలీసు అధికారి వీఆర్ కి వెళ్లేలా చేసింది.. ఓ మహిళా కానిస్టేబుల్ కోసం ఒక సీఐ ఇంకా మరో కానిస్టేబుల్ బహిరంగంగా కొట్టుకోవడం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అందరికీ ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే ఇలా కోక కోసం నడిరోడ్డుపై కొట్టుకోవడం అనేది అందరూ వేలెత్తి చూపేలా చేసింది.ఇక భీమవరం వన్ టౌన్ పోలీస్టేషన్లో ఓ లేడీ కానిస్టేబుల్ ని రాజేశ్ అనే ఓ కానిస్టేబుల్ బైక్ పై లిఫ్ట్ ఇస్తుండటాన్ని సీఐ కృష్ణ భగవాన్ చూసి అతను తట్టుకోలేకపోయాడు.


 దీనితో ఈ విషయమై ఇక కానిస్టేబుల్ ని ప్రశ్నించి.. అజమాయిషీ చేసే తరుణంలో పర్సనల్ అనే మాట రావడంతో ఆ విషయం కాస్త చినికి చినికి పెద్ద గాలివానగా మారింది. ఆపై ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు కూడా వచ్చింది. ఇక జిల్లాలో పోలీసుశాఖ పరువుని తీసిన ఈ ఘటన ఉన్నతాధికారులకు అయితే ఎంతో కోపాన్ని తెప్పించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కానీ విచారణ చేసిన ఉన్నతాధికారులు సీఐ తప్పుకి పనిష్మెంట్ ఇస్తూ వీఆర్ కు పంపడం జరిగింది. ఆడదాని కోసం రాజ్యాలే పోయాయని పురాణాల్లో మనం చదువుకున్నాం.. ఒక్క మహిళా కానిస్టేబుల్ కోసం ఒక పోలీసు అధికారి ఇంకా మరో కానిస్టేబుల్ నడిరోడ్డుపై తన్నకోవడం భీమవరంలోచే చూస్తున్నామంటూ అక్కడవారంతా కూడా బహిరంగంగానే పోలీసుల చేసిన ఘటనపై దుమ్మెత్తి పోశారు.ఇక ఎంతవారలైనా కాంత దాసులే అనడానికి కోక కోసం పోలీసుల కొట్లాట ఉదాహరణగా ఇక్కడ చెప్పొచ్చేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: