ప్రతిదానికీ చంద్రబాబునాయుడుతో పాటు తమ్ముళ్ళంతా ప్రభుత్వాన్ని రద్దుచేయండి మధ్యంతర ఎన్నికలకు వెళదామని జగన్మోహన్ రెడ్డిని సవాళ్ళు చేస్తునే ఉన్నారు. తాజాగా అమరావతి-మూడు రాజధానుల విషయంలో కూడా పయ్యావుల కేశవ్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజరాపు అచ్చెన్నాయుడు లాంటివాళ్ళు అనేకమంది మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి రెఫరెండం కోరుదామంటు పదే పదే చాలెంజులు విసురుతున్నారు.






నిజానికి వీళ్ళు ఎందుకు చాలెంజ్ చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని జగన్ రద్దుచేయరన్న నమ్మకంతోనే. తమ గెలుపుమీద టీడీపీకి నమ్మకముంటే ప్రభుత్వాన్ని రద్దుచేయమని జగన్ను డిమాండ్ చేసేవాళ్ళేకాదు. ప్రభుత్వాన్ని రద్దుచేయమని జగన్ను డిమాండ్ చేయటం కన్నా తమ ఎంఎల్ఏ పదవులకు వీళ్ళే రాజీనామాలు చేసేయచ్చు. ఎదుటి వాళ్ళని రాజీనామా చేయమని బ్రతిమలాడుకునే బదులు తామే రాజీనామా చేసేయచ్చుకదా. మళ్ళీ ఆపని మాత్రం చేయటంలేదు.





తెలంగాణా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఉన్నంత ధైర్యం కూడా చంద్రబాబు అండ్ కో లో కనబడటంలేదు. కేసీయార్ మీద నిరసనతో, కాంగ్రెస్ మీద కోపంతో ఈటల, కోమటిరెడ్డి తమ ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేసిన విషయం అందరు చూసిందే. మరి అదే పద్దతిలో  టీడీపీకి చెందిన 23 మంది ఎంఎల్ఏలు ఎందుకు రాజీనామాలు చేయకూడదు ? ప్రజాతీర్పు ఏమిటో తేలిపోతుంది కదా ? జనాలు ఏకైక రాజధాని అమరావతికి అనుకూలమా ? లేకపోతే మూడు రాజధానులకు మద్దతిస్తున్నారా అనేది తేలిపోతుంది. గెలుపుమీద చాలామందికి నమ్మకం లేనట్లుంది. అందుకనే తాము రాజీనామా చేయకుండా జగన్ను ప్రభుత్వాన్ని రద్దుచేయమని డిమాండ్లు చేస్తున్నారు.





పోయిన ఎన్నికలకు ముందుకూడా ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వం వైఖరికి నిరసనగా జగన్ తన ఐదుగురు ఎంపీలతో రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలకు రెడీఅని చెప్పి చివరినిముషంలో యూటర్న్ తీసుకున్నారు. అంటే డైరెక్టుగా ప్రజాతీర్పు కోరేంత ధైర్యం చంద్రబాబులో ఎప్పుడూ లేదు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రజా బలమున్న నేత కాదు కాబట్టి. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి సీఎం అయిన వ్యక్తికి ప్రత్యర్ధిని నేరుగా ఢీకొనేంత శక్తి ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: