వచ్చే ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా గెలవాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టిన నియోజకవర్గాల్లో టెక్కలి కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాల్సిందే అని జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే సాధ్యంకాదని అందరికీ తెలుసు. కాకపోతే పార్టీ నేతల్లో టీడీపీని ఓడించాలనే కసిని రగల్చటానికే జగన్ ఈ మాట చెబుతున్నట్లున్నారు. ఇందులో భాగంగానే మొదటినుండి కుప్పంను టార్గెట్ చేస్తున్న జగన్ తాజాగా టెక్కలి నియోజకర్గంపైన కూడా దృష్టిపెట్టారు.





టెక్కలిలో ఇపుడు టీడీపీ అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా అచ్చెన్నే గెలిచారు. 2019లో అఖండ మెజారిటితో గెలిచిన తర్వాత అసెంబ్లీలో జగన్ను లేదా అధికారపార్టీని దీటుగా ఎదుర్కొంటున్న టీడీపీ ఎంఎల్ఏల్లో అచ్చెన్న మొదటివరసలో ఉంటారు. ఇక బయట మీడియా సమావేశాల్లో అయినదానికి కానీదానికి జగన్ టార్గెట్ గా అచ్చెన్న రెచ్చిపోతుంటారు. ఇందుకనే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు అచ్చెన్నను కూడా కచ్చితంగా ఓడించితీరాలని టార్గెట్ పెట్టుకున్నారు.





క్యాంపుఆఫీసులో బుధవారం అంటే ఈరోజు టెక్కలి నేతలు, శ్రేణులతో జగన్ సమావేశం అవబోతున్నారు. ప్రభుత్వం, పార్టీ తరపున అవసరమైన సహకారం అందించే విషయంలో  భరోసా ఇవ్వబోతున్నారని సమాచారం. ఇప్పటికే టెక్కలిలో ఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలా యాక్టివ్ గా తిరుగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అచ్చెన్నపై పోటీచేసి ఓడిపోయిన పేరాడ తిలక్ ఎందుకనో కాస్త సైలెంట్ అయ్యారు.





నిజానికి గడచిన రెండు ఎన్నికల్లో అచ్చెన్న గెలిచింది సుమారు 8 వేల ఓట్లతోనే. అంటే వైసీపీ గట్టిగా పట్టుబడితే టీడీపీని ఓడించటం పెద్ద కష్టం కాదన్నది జగన్ భావన. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమలుచేస్తున్న సంక్షేమపథకాలు వచ్చే ఎన్నికల్లో ఆదుకుంటుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. దీన్నే బాగా అడ్వాంటేజ్ తీసుకోవాలని జగన్ ఎంఎల్ఏలు, నేతలకు పదేపదే చెబుతున్నది. మరి ఈరోజు సమావేశంలో టెక్కలి నేతలకు ఏమి చెబుతారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: