వచ్చే నెలలో టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారా ? విశాఖపట్నం టీడీపీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. చాలాకాలంగా గంటా పార్టీలో అంటీముట్టనట్లున్న విషయం తెలిసిందే. తనకు అవసరమైనపుడు మాత్రమే పార్టీలో గంటా కనబడుతున్నారు. లేకపోతే ఎప్పుడైనా తాను కలవదలచుకున్నపుడు మాత్రమే చంద్రబాబునాయుడును కలుస్తున్నారు. అంటే టీడీపీ ఎంఎల్ఏగా చెలామణి అవుతున్నారే కానీ పార్టీతో సంబంధాలు లేకుండానే వ్యవహరిస్తున్నారు.






గంటా వైఖరి ఏమిటో చంద్రబాబుతో పాటు చాలామంది తమ్ముళ్ళకి అర్ధం కావటంలేదు. టీడీపీలోనే ఉంటారా లేకపోతే బయటకు వెళిపోతారా అనే అయోమయం పెరిగిపోతోంది. ఒకసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలుస్తారు. మరోసారి వైసీపీ ముఖ్యులతో భేటీ అవుతారు. ఇలా రకరకాలుగా గంటా విన్యాసాలు కంటిన్యు అవుతున్నాయి. ఒకదశలో వైసీపీలో చేరటం ఖాయమని ప్రచారం జరిగినా ఎందుకనో కాలేదు. మాజీమంత్రి, భీమిలీ ఎంఎల్ఏ అవంతి శ్రీనివాస్ కారణంగానే గంటాను వైసీపీలో చేర్చుకోవటంలేదనే ప్రచారం కూడా తెలిసిందే.





ఇంతలోపల వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్ ఉత్తరం నియోజకవర్గం ఎంఎల్ఏగా  గంటా రాజీనామా చేశారు. ఏదేమైనా గంటా వ్యవహారమైతే అన్నీపార్టీల్లోను చర్చనీయాంశంగానే మారింది. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా తన మద్దతుదారులతో సమావేశమయ్యారని సమాచారం. డైరెక్టుగా చెప్పకపోయినా పరోక్షంగా అధికారపార్టీలో చేరే విషయాన్ని ప్రస్తావించారట. గతంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని కూడా చెప్పారట.





దాంతో గంటా తొందరలోనే వైసీపీలో చేరటం ఖాయమనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఒకటిరెండు రోజుల్లో  మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నారు. తన రాకీయ నిర్ణయాన్ని ఒకసారి చిరంజీవితో చెప్పి టీడీపీకి రాజీనామా చేస్తారని సమాచారం. డిసెంబర్ 1వ తేదీన గంటా పుట్టినరోజుంది. ఆ సందర్భంగా తన మనసులోని మాటను బయటకు చెప్పే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారాలు కూడా గతంలో జరిగాయి.  వైపీపీలో చేరుతారా లేదా అన్నది పక్కనపెట్టేస్తే టీడీపీలో ఉండరనేది మాత్రం దాదాపు  తేలిపోయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: