మాములుగా ఎన్నికలు వస్తున్నాయంటే ఆయా ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో చురుకుగా పాల్గొని క్షేత్ర స్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే కార్యకర్త నుండి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వరకు అందరిలోనూ అధిష్టానం ఈ ఎన్నికలో గెలుపు మనదే అన్న ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. అప్పుడే పోటీ చేస్తున్న అభ్యర్థులలో మరియు ఓటర్లలో ఒక చైతన్యం వస్తుంది. అదే విధంగా తాజాగా జరిగిన గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటా పోటీగా బీజేపీ, కాంగ్రెస్ మరియు ఆప్ పార్టీలు ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పడు ఎలక్షన్ అయిపోయి , దాని ఫలితాలు కూడా నిన్ననే వెలువడిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీ విజయాన్ని దక్కించుకుని మళ్ళీ అధికారాన్ని చేపట్టనుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు అక్కడి ఓటర్లు పట్టం కట్టారు. అయితే ఎన్నికల ముందు వరకు గుజరాత్ ఎన్నిక చర్చల్లో నిలిచింది. అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ ఈసారి బీజేపీకి షాక్ ఇస్తుందని అంతా ఊహించారు. ఇది మాత్రమే కాకుండా ప్రచారానికి ముందే ఆప్ తరపున సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించి రాజకీయ ప్రముఖులను సైతం ఆశ్చర్యపరిచారు. అయితే ఎన్నికల యుద్ధంలో వాస్తవ పరిస్థితులు చూస్తే ఆప్ చాలా దారుణమైన ఫలితాన్ని దక్కించుకుంది. గుజరాత్ లో మొత్తం 182 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, వాటిలో గుజరాత్ అత్యధికంగా 156 స్థానాలను గెలుచుకుని బంపర్ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది.

ఇక్కడ బీజేపీ గత సంవత్సరాలుగా అధికారంలో ఉంది, అంతటి బలంగా ఇకాది ప్రజల్లో పార్టీ మూలలను నాటడంలో సఫలం అయిందని చెప్పాలి. ఇక కాంగ్రెస్ 17 స్థానాలను గెలుచుకుని మరోసారి తమ బలహీనతను చాటుకుంది. ఇక నిన్న మొన్నటి వరకు ఎగిరెగిరి పడిన ఆప్ కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. గుజరాత్ ఓటర్లు ఆప్ కు చుక్కలు చూపించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: