ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జరగనున్న ఎన్నికల్లో గెలిచేది ఏ పార్టీ అని రాష్ట్రము అంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. వాస్తవానికి ఎన్నికలు జరగడానికి ఇంకా సంవత్సరం పైగానే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే నాయకులు, ప్రజలు మరియు మీడియాకు ఈ విషయంపైన ప్రత్యేక శ్రద్ద ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పాలన మీద రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి మరియు రాజధాని విషయంలో జగన్ ఫెయిల్ అయ్యాడని సొంత పార్టీ నేతలు కొందరు అంటుండడం మనము చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అని చెప్పాలి.

మరోవైపు ప్రతిపక్షములో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ సారి గెలవకపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ బహిరంగ ప్రకటనలు చేయడంతో ఇంకా సీరియస్ నెస్ పెరిగింది. టీడీపీ ఒంటరిగా కనుక పోటీ చేస్తే వైసీపీని ఓడించడం కష్టం అని భావించిన చంద్రబాబు టీం.. ఇప్పుడిప్పుడే ప్రజల మధ్యకు వెళుతూ కూడగట్టుకుంటున్న జనసేన పార్టీని తమతో కలుపుకుని వెళ్లాలని గట్టిగ ప్రయత్నాలు చేస్తున్నారు.  ఆ దిశగానే ఒకటి రెండు సార్లు స్వయంగా చంద్రబాబు వెళ్లి పవన్ ను కలిశాడు. దీనితో ఎన్నికల్లో టీడీపీ జనసేనలు కలిసి వైసీపీని ఎదుర్కోనున్నాయంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే తాజాగా పవన్ వ్యాఖ్యలు మళ్ళీ ఈ విషయంపైనా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

పవన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా మేము పోటీ చేస్తాము.. ఒంటారిగానా లేదా ఏదైనా పార్టీని కలుపుకుని వెళ్తామా అన్నది ఇప్పుడు విషయం కాదు. అసలు దాని గురించిన ప్రస్తావన ఇప్పుడు తీసుకువచ్చే అవసరం కూడా లేదు అని కొట్టిపారేశారు. అంతే కాకుండా ఎన్నికలకు పది రోజుల ముందు మాత్రమే మా నిర్ణయాన్ని ప్రజలకు చెబుతాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి చంద్రబాబు పైన పవన్ కు ఇంకా నమ్మకం కుదిరినట్లు లేదని సోషల్  మీడియా కోడై కూస్తోంది. మరి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటూ రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: