రెండురోజుల జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ సస్పెన్సుగా మారింది. శుక్ర, శనివారాల్లో జగన్ పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నీ రద్దవ్వటంతో రాజకీయంగా ఒక్కసారిగా కలకలం మొదలయ్యింది. శనివారం జగన్ ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడి, అమిత్ షా తో భేటీ అవబోతున్నట్లు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం 30వ తేదీన సీఎం ఢిల్లీకి వెళ్ళాలి. కానీ ఒకరోజు ముందే ప్రీపోన్ చేసుకుని ఢిల్లీకి వెళుతున్నట్లు ప్రచారం పెరిగిపోయింది.





దీంతో సీఎం ఢిల్లీ పర్యటనపై ఒక్కసారిగా అందరిలోను ఆసక్తి పెరిగిపోయింది. శుక్రవారం షెడ్యూల్ ప్రకారం గుంటూరు జిల్లాలోని పొన్నూరు, హైదరాబాద్ లో కార్యక్రమాల్లో అటెండవ్వాల్సుంది. వాటిని అర్ధాంతరంగా రద్దుచేసుకున్నారు. అలాగే శనివారం వైజాగ్ లో చాలా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇందులో కీలకమైనది ఏమిటంటే శారధా పీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగం. స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల ఆధ్వర్యంలో జరుగుతున్న యాగంలో పాల్గొనాలి.





యాగంలో పాల్గొన్న తర్వాత ఎంపీల కుటుంబాల్లోని ఫంక్షన్లకు కూడా హజరవుతారని ముందుగా షెడ్యూల్ ఫిక్స్ చేశారు. కానీ చివరినిముషంలో విశాఖ పర్యటననే రద్దుచేసుకున్నారు. శారధాపీఠంలో జరిగే రాజశ్యామల యాగంలో పాల్గొనే కార్యక్రమాన్ని కూడా జగన్ రద్దు చేసుకున్నారంటేనే అందరు ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం నరేంద్రమోడీ నుండి ఏ క్షణమైనా పిలుపురావచ్చనే పార్టీవర్గాలు చెబుతున్నాయి. కొన్ని ముఖ్యవిషయాలపై మోడీతో చర్చించేందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.





మార్చి-ఏప్రిల్లో పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించటం, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, రాజకీయ డెవలప్మెంట్లపై బ్రీఫింగ్ ఇవ్వటం లాంటి అంశాలున్నట్లు సమాచారం. ఏదేమైనా శుక్ర, శనివారాల్లో రద్దయిన జగన్ షెడ్యూల్ రాజకీయవర్గాల్లో బాగా ఆసక్తిని రేపుతోంది. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలకు మోడీ దగ్గర జగన్ గ్రీన్ సిగ్నల్ తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి జగన్ అడిగినపుడల్లా మోడీ, అమిత్ షా అపాయిట్మెంట్లు ఇస్తున్నది వాస్తవం.  ఆ అడ్వాంటేజ్ ను రాజకీయంగానే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగిస్తే బాగుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: