రెండురోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు మొదటిరోజు గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. రు. 13 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు కుదిరాయి. ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు చాలామంది మొదటిరోజైన శుక్రవారం సదస్సులో పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, సుమిత్ సిన్హా, ఎన్టీపీసీ ఛైర్మన్, గ్రంధి మల్లికార్జునరావు లాంటి అనేకమంది ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి తమవంతుగా పెట్టుబడులను ప్రకటించారు. మాట్లాడిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని అభినందించారు.





సీన్ కట్ చేస్తే సదస్సు నిర్వహణలో భాగంగా ఏర్పాటుచేసిన భోజనశాల దగ్గర తోపులాట జరిగిందట. కొందరికి సదస్సు కోసం సిద్ధంచేసిన కిట్లు అందలేదట. ఇవి ఎల్లోమీడియాకు కనబడిన విషయాలు. వీటిని ఎల్లోమీడియా ప్రముఖంగా హైలైట్ చేసింది. జగన్ మాట్లాడింది, ముఖేష్ ప్రకటన, అదానీ చెప్పిన పెట్టుబడులు, జిందాల్ ప్రకటించిన రు. 10 వేల కోట్లు, ఎన్టీపీసీ ప్రకటించిన రు. 2.35 లక్షల కోట్ల పెట్టుబడి లాంటివి ఏవీ ఎల్లోమీడియా చెవిలో పడలేదు. పైగా ‘పెట్టుబడులా..కట్టుకథలా’ అనే బ్యానర్  హెడ్డింగ్ తో కథనం రాసింది. విశాఖ సదస్సులో లెక్కలపై విస్మయం అని కథనం రాసింది. అన్నీ బోగస్ లెక్కలే అని తేల్చేసింది. చంద్రబాబునాయుడు హయాంలో చెప్పిన ఇవే లెక్కలను అప్పట్లో బ్రహ్మాండమని ఊదరగొట్టింది.





రెండురోజుల పెట్టుబడుల సదస్సు మీదే యావత్ దేశం దృష్టి నిలిపింది. ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సులో ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలు పరిశ్రమల రంగం  భవిష్యత్ పైన కూడా మాట్లాడారు. భవిష్యత్తులో ఎలాంటి రంగాలకు డిమాండ్ ఉంటుందో వివరించారు. పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను, ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను జగన్ వివరించారు. ఇవేవీ ఎల్లోమీడియాకు వినబడలేదు, కనబడలేదు. శుక్రవారం ఉదయం సదస్సు ప్రారంభమైతే మధ్యాహ్నం పైనుండి భోజనాల దగ్గర తోపులాట, కిట్ల అందలేదన్న అంశాలను బాగా హైలైట్ చేసింది.





పనిలో పనిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు, బోండా ఉమ లాంటి తమ్ముళ్ళు ప్రత్యేకించి విశాఖపట్నంలోనే మీడియా సమావేశంపెట్టి  ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలకు ప్రాధాన్యతిచ్చింది. ఒకవైపు లక్షల కోట్ల రూపాయలు పెట్టబడులు వస్తే నాలుగేళ్ళుగా జగన్ పరిశ్రమలను తరిమేస్తున్నారంటు చేసిన ఆరోపణలే ఎల్లోమీడియాకు వినబడింది. మొత్తంమీద సదస్సు మొదటిరోజు విజయవంతం అవ్వటం ఎల్లోమీడియా, టీడీపీకి మింగుడుపడలేదని అర్ధమైపోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: