వచ్చేనెలలో జరగబోతున్న పార్టీ పండుగ మహానాడులో కీలక ప్రకటన చేయాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయినట్లు సమాచారం. మే 27,28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు జరగబోతోంది. ఆ రెండురోజుల పండుగ సందర్భంగానే చంద్రబాబు అభ్యర్ధుల ప్రకటన చేయబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబు, లోకేష్ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. తన పర్యటనల్లో చంద్రబాబు కొందరు అభ్యర్ధులను ప్రకటిస్తే పాదయాత్ర సందర్భంగా లోకేష్ మరికొందరు అభ్యర్దులను ప్రకటించారు.





 ఇద్దరు కలిసి సుమారు 50 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. 50 నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్ధుల పనితీరును రివ్యూ చేస్తున్నారు. దీని ప్రకారం మహానాడు సందర్భంగా 28వ తేదీన బహిరంగసభ జరగబోతోంది. ఆ బహిరంగసభలోనే అభ్యర్దులను మళ్ళీ ప్రకటించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మహానాడులో అభ్యర్ధులను ప్రకటించటం గతంలో ఎప్పుడూ లేదు.





 రాబోయే ఎన్నికల ప్రత్యేకత కారణంగా పరిస్ధితులను భేరీజు వేసుకునే మహానాడులో అభ్యర్ధులను ప్రకటిస్తే పార్టీతో పాటు అభ్యర్దుల్లో మంచి జోష్ పెరుగుతుందని కొందరు తమ్ముళ్ళు చంద్రబాబుకు సూచించారట. వాళ్ళ సూచనకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఒక విధంగా రాబోయే మహానాడు స్పెషలనే అనుకోవాలి. ఇదే సందర్భంగా ఎన్నికలకు ముందు జరగబోతున్న పండుగ కాబట్టే మహానాడు చాలా స్పెషల్ గా మారబోతోంది. ఎన్నికల్లో గెలిస్తే తర్వాత జరగబోయే మహానాడు ఓ రేంజిలో ఉంటుందనటంలో సందేహంలేదు.





 అలా కాకుండా ప్రతిపక్షానికే పరిమితమైతే మాత్రం మహానాడు నిర్వహణలో ఎవరూ పెద్దగా ఆసక్తిచూపరన్నది నిజం. అందుకనే రేపటి నెలలో జరగబోయే మహానాడునే బ్రహ్మాండంగా జరుపుకోవాలన్నది పార్టీ నిర్ణయించింది. మహానాడు 100 ఎకరాల్లో  నిర్వహించబోతున్నారు. నిర్వహణ బాధ్యతలను రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి చూసుకుంటున్నారు. జాతీయ రహదారికి దగ్గరలోనే ఉన్న వేమగరి, కాతేరు ప్రాంతంలోని మరో స్ధలాన్ని గుర్తించారు. వేదిక తదితరాల కోసం 20 ఎకరాలు, భోజన సదుపాయాల కోసం 30 ఎకరాలు, వాహనాల పార్కింగ్ నిమిత్తం 40 ఎకరాలు అవసరం అవుతుందని అచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: