2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమి తర్వాత దురాలోచనలతో బీజేపీ లోకి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించి చూస్తున్నారని వైసీపీ పార్టీ ఓ వైపు చెప్తున్నా వినకుండా బీజేపీ పార్టీ వారిని చేర్చుకుని పూర్తిగా మునుగక ముందే కళ్ళు తెరచి వారిని దూరం పెట్టడం మంచిదని పార్టీ క్యాడర్ భావిస్తుంది. బీజేపీలో చేరిన వలస నాయకుల పరిస్థితే ఇప్పుడేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ్నుంచి అక్కడకెళ్ళి, అక్కడి నుంచి ఇక్కడ స్టీరింగ్ తిప్పేద్దామనే బహుదూరపు వ్యూహంతో వెళ్ళిన వాళ్ళంతా ఎటువంటి కీలక పదవులు దక్కకుండా ఉండిపోవాల్సి రావడం నిజంగా వారి వైపు నుంచి తీవ్ర ఇబ్బందికర పరిస్థితేనని చెబుతున్నారు