గత రెండు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో  ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా గురించే చర్చ జరుగుతుంది దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో నెలకొల్పిన కియా ప్లాంట్  తమిళనాడు కు తరిలిపోతుందని కథనాలు రావడమే...  ప్రముఖ జాతీయ వార్త పత్రిక రాయిటర్స్ ఈ వార్తను ప్రచురించడం తో చాలా మంది నిజమేనేమో అనుకున్నారు అయితే  శుక్రవారం  కియా ఎండీనే స్వయంగా  మీడియా తో మాట్లాడుతూ... కియా ప్లాంటు ఎక్కడికి తరలిపోవడం లేదని అనంతపురంలోనే  ఉంటుంది, ఇక్కడి నుండే  ప్రపంచ స్థాయి వాహనాలను తయారుచేస్తామని వెల్లడించడంతో కియా తరలింపోతుందనే వార్తలకు చెక్ పెట్టారు. 
 
ఇక కియా విషయం లో తప్పుడు కథనాలను రాసి రాయిటర్స్ గందరగోళం సృష్టించడం వెనుక పెద్ద కథే వుంది. గతంలో చంద్రబాబు పాలన లో రాయిటర్స్ భారీగా లబ్ది పొందింది. అందులో భాగంగా 2017లో తెలుగుదేశం ప్రభుత్వం రాయిటర్స్ తో  రెండు ఒప్పందాలు చేసుకుంది. విశాఖ లోని గీతం యూనివర్సిటీ లో ఇన్నోవేషన్ యాప్ స్టూడియో ఏర్పాటు చేసుకునేలా ఒక ఒప్పదం జరుగగా ..  ఈ -ప్రగతి కార్యక్రమం కింద బాబు ప్రభుత్వం మరో ఒప్పుందం చేసుకుంది అలా  ఈరెండు  ఒప్పందాల రూపంలో రాయిటర్స్ కు భారీ గా ఆర్ధిక ప్రయోజనం చేరుకుంది. 
 
తమకు ఇంత మేలు చేసిన వారి కోసమే రాయిటర్స్  తాజాగా  కియా విషయం లో తప్పుడు వార్తలు ప్రచురించి ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలా చేయడం వల్ల జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమి లేదు కానీ ఇన్ని రోజులు రాయిటర్స్ లో న్యూస్ వస్తే అది నిజమే అని నమ్మే  ప్రజలు ఈ కియా తో రాయిటర్స్ మీద విశ్వాసం కోల్పోయే ప్రమాదముంది. కాగా రాయిటర్స్ ఒక్క దాంట్లో మాత్రం  సక్సెస్ అయ్యింది. అదేంటంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఇన్నిరోజులు రాయిటర్స్ అనే పత్రిక ఉన్నట్లు పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు కియా పుణ్యమాంటూ రాయిటర్స్ పేరు మారుమోగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: