
‘‘130కోట్ల మంది భారతీయుల ప్రాణాలను అనుక్షణం రక్షించే జవాన్ల రుణాన్ని మనం ఏమిచ్చి తీర్చుకోగలం. నిండైన మనసుతో వారికి జేజేలు పలకడం తప్ప. ఎండనక, వాననక, కాలాలకు అతీతంగా అహర్నిశలు మన దేశ సరిహద్దులను కాపాడే సైనికుల త్యాగనిరతి వెలకట్టలేనిది. మన ప్రాణాలను రక్షించడానికి తమ ప్రాణాల్ని అడ్డువేసే వారి ధీరత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతా పూర్వకంగా సెల్యూట్ చేస్తున్నా, ఈ దేశాన్ని కాపాడే వీర పుత్రులకు నా తరపున జనసేన శ్రేణుల తరపున జేజేలు పలుకుతున్నా’’ అని ట్విట్టర్లో ఓ పోస్ట్ ఉంచారు పవన్ కల్యాణ్.
ఆర్మీడే రోజున సోషల్ మీడియాలో దేశభక్తి వెల్లివిరియడం సహజమే. కానీ సెలబ్రిటీలు ఇంత భావోద్వేగమైన పోస్ట్ ను పంచుకోవడం అరుదు. అందూలోనూ ఆర్మీ కుటుంబాలకు పెద్ద మనసుతో పెద్ద విరాళం ఇచ్చే పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి నుంచి వచ్చిన పోస్ట్ కావడంతో గంటల వ్యవధిలోనే ఇది వైరల్ గా మారింది. పవన్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని రుజువు చేసుకున్నారని, జవాన్లపై తనకున్న గౌరవాన్ని ఇలా చాటుకున్నారని అంటున్నారు నెటిజన్లు.
మరోవైపు పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ టీజర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. సంక్రాంతి కానుకగా ఈ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. చిన్న డిజప్పాయింట్ మెంట్ ఏంటంటే.. సిినిమా రిలీజ్ డేట్ లేకపోవడం. సినిమా విడుదలకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు అది నిరాశే అయినా.. త్వరలోనే వకీల్ సాబ్ థియేటర్స్ లోకి వస్తుందనేది సినీ వర్గాల సమాచారం.