ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఆ పార్టీకి ఒక ఎంపీ నుండి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆయనే నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణం రాజు. మొదట్లో ఏదో ఆపదవిని ఆశించి, దానికి వైసీపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో తన పంతాన్ని మొదలుపెట్టిన రఘు రామ నేటికీ అదే లెవెల్ లో అధికార పార్టీ పై మరియు ప్రభుత్వంపై దొరికినప్పుడల్లా తన ఆగ్రహాన్ని చూపిస్తున్నాడు. అయితే ఈయన ఎప్పుడూ కూడా తన అక్కసును స్వంత కక్షగా చూపలేదు. తాను ఏది మాట్లాడినా, విమర్శించినా పూర్తి ఆధారంతో మరియు ఒక విధాన పరముగా వైసీపీని ఇరుకునపెడుతూ వస్తున్నాడు.

ఇందులో ఇతను సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ తన స్వంత నియోజకవర్గమయిన నరసపురానికి వెళ్ళాడు. అయితే అక్కడ వైసీపీ కార్యకర్తలు రఘు రామ కృష్ణం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమాలు నినాదాలు మరియు కేసులు కూడా పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ రఘు రామ చాలా నేర్పరిగా ప్రత్యక్షంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఒక సిస్టం ప్రకారం లోక్ సభ స్పీకర్ కి ఈ విషయమై లేఖ రూపంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

రఘు రమా లేఖలో చెప్పిన దాని ప్రకారం తనను అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతోందని దీనిపై వెంటనే స్పందించి దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని కోరడమైనది. ఈ లేఖపై స్పందించిన లోక్ సభ స్పీకర్ కార్యాలయం వెంటనే లేఖపై విచారణ జరిపి పూర్తి నివేదికను ఇవ్వవలసిందిగా కేంద్ర హోమ్ శాఖను కోరడమైనది. ఈ విషయాన్ని 14 రోజులలో పరిష్కరించాలని కోరింది. అంతే కాకుండా హోమ్ శాఖ నివేదిక కాపీని రఘు రామ కృష్ణం రాజుకు అందించమని చెప్పింది. దీని ద్వారా స్థానిక నాయకులపై రఘు రామ రాజు తన సత్తా చూపిస్తున్నారని చెప్పవచ్చు. మరి దీనిని ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: