విజ‌య‌వాడ అధికార పార్టీలో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేమి మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు తుదిరోజు ప్ర‌చారంలో నేత‌లు క‌లిసిరాలేద‌నే టాక్ వినిపిస్తోంది. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిదిలో 28 వార్డు కార్పొరేట‌ర్‌గా ఏపీ ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్ పూనూరు గౌతం రెడ్డి కుమార్తె లిఖితా రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమెనే మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేస్తున్నారు.(దీనిని ఇంకా అదికారికంగా ప్ర‌క‌టించ‌లేదు) ఈ క్ర‌మంలో చివ‌రి రోజు జోరుగా ప్ర‌చారం చేయాల‌ని గౌతంరెడ్డి ప్ర‌ణాళిక సిద్ధం చేసు కున్నారు. ఈ క్ర‌మంలో సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణును రంగంలోకి దింపి.. ప్రచారం చేయించుకోవాల‌ని అనుకున్నారు. అయి తే.. ఆయ‌న రాలేదు. తాను బిజీగా ఉన్నాన‌ని పీఏతో క‌బురు పెట్టారు.

దీంతో పూనూరు సొంత‌గానే రంగంలోకి దిగి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో సినీ న‌టుడు, ర‌చ‌యిత‌.. పోసాని కృష్ణ‌ముర‌ళిని రంగంలోకి దింపి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆయ‌న చేసిన ప్ర‌చారం.. రోడ్ షో.. లిఖితా రెడ్డికి క‌లిసివ‌స్తాయ‌నే అంటున్నారు. అయితే.. ఎమ్మెల్యే రాక‌పోవ‌డం మాత్రం.. గౌతం రెడ్డి వ‌ర్గంలో చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగానే ప్ర‌చారానికి రాలే ద‌ని.. అంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మేయ‌ర్ అభ్య‌‌ర్థిత్వ‌మేన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

పూనూరుకు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ద‌గ్గ‌ర మంచి ప‌లుకుబ‌డి ఉంది. ఆయ‌న సిఫార‌సుతోనే ఏపీ ఫైబ‌ర్ నెట్ చైర్మ‌న్‌గా ఆయ‌న ప‌ద‌వినిపొందారు. ఇప్పుడు ఆయ‌న కుమార్తె లిఖితా రెడ్డిని మేయ‌ర్ చేసేందుకు కూడా సజ్జ‌ల స‌హకారం తీసుకుంటున్నారు. అయితే.. ఈ విష‌యంలో త‌న వ‌ర్గం కాని పూనూరు కుటుంబానికి మేయ‌ర్ ప‌ద‌విని ఇస్తే.. రేపు త‌న సీటుకు ఎసరు పెట్టే ఛాన్స్ ఉటుంద‌ని ఎమ్మల్యే భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో త‌న‌కున్న ప‌రిచ‌యాల రీత్యా.. మ‌ల్లాది విష్ణు.. కూడా త‌న వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రి పేర్ల‌తో రంగంలోకి దిగార‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠాన్ని రిజ‌ర్వ్ చేశారు. దీంతో త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని ఇక్క‌డ మేయ‌ర్ చేయ‌డం ద్వారా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గంలో త‌న హ‌వాను నిలుపుకొనేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ వివాద‌మే ఇప్ప‌డు రెడ్డి వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదంగా మారింద‌ని ప్ర‌చారంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: