మ‌ళ్లీ బాలు అని రాయ‌డంలో ఔన్న‌త్యం ఉంది

బాలును స్మ‌రించుకుంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఝ‌రిలో

సిరివెన్నెల వినిపిస్తారు.. ఆ విధంగా ఆ ఇద్ద‌రూ

ఇవాళ మ‌న ఇంట ఈ ఆదివారం తెలుగు వారి లోగిళ్ల‌లో

కొలువుదీరనున్నార‌ని భావిద్దాం. ఎస్పీ చ‌ర‌ణ్ నేతృత్వాన

దిద్దుకుంటున్న స్వ‌రాల‌యానికి స్వ‌రాభిషేక సంప‌త్తికి ప్రాభ‌వానికి

స్వాగ‌తం చెప్పుకుంటూ.. మ‌రో కార్తీకం ఈ గేయం మ‌రో వైరాగ్యం కానీయ‌కుంటే చాలు



మ‌రుపే లేని హృద‌యాలు మావి క‌నుక.. కొత్త గాయ‌కుల గానాలు వారి న‌డ‌వ‌డి వ్య‌క్తిత్వ  వివ‌రాలు నాటి బాలు గారికి న‌చ్చితే చాలు. నేటి బాలు అయిన చ‌ర‌ణ్ నిర్దేశానికి అనుగుణంగా ఉంటే చాలు. ఇంకేమీ వ‌ద్దు. ఆడిష‌న్లు పూర్త‌య్యాయి..స్వ‌ర రాగ మైత్రికి  16 మంది సిద్ధం అవుతున్నారు. ఆ చిరంజీవులు పోనీ స్వ‌రంజీవుల‌కు అభినంద‌నలు..శుభాకాంక్ష‌లు.. చిన్నారులూ మీరు పాపానికి కూడా ఏడ‌వద్దు.. కంట నీరు ఒలికించ‌వ‌ద్దు.. ఇవేవీ పెద్ద బాలుకు న‌చ్చ‌వు..ఆయ‌న‌కు న‌చ్చ‌నివి చిన్న బాలు చేయ‌రు క‌నుక మీ హృద‌య గాన నివేద‌న  మాకెంతో ఇష్టం.. మీరు గెలిచినా ఓడినా ఈ తెలుగు ఇంటి బిడ్డ‌లంతా మీ రాక‌ను మీ గ‌మ‌నా న్నీ ఎంత‌గానో ప్రేమిస్తున్నారు అన్న విష‌యాన్నే గుర్తించండి.. తెలుగు పాట పాడుతున్న వేళ ఉచ్ఛార‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వండి.. గ‌ర్వించండి.. ఆ త‌ల‌పొగ‌రు మాకెంతో ఇష్టం. ఆహ్వానించేద్దామా ఆ చిన్నారిని అని చెప్తారే అదే మాకు మీ గ‌ళం నుంచి మ‌రో మారు వినిపించాలి... చ‌ర‌ణ్! 


మ‌రొక్క‌సారి సామ‌వేద సారాన్ని ఆలపిస్తున్నా బిడ్డ‌ల‌కు దీవెన‌లు మా త‌ర‌ఫున మీ వాద్య బృందం త‌ర‌ఫు న..ప్ర‌వాస భార‌తీయం నుంచి వీస్తున్న శీత గాలుల వింజామ‌ర‌ల త‌ర‌ఫున.. మా తెలిమంచు సోన‌ల త‌ర‌ఫున.. కురిసి మెరిసే తార ల త‌ర‌ఫున.. పాడుతా తీయ‌గాకు పునః స్వాగ‌తం.. స‌రికొత్త సంచిక స‌రాగ వీచిక.. ఈటీవీ నుంచి మీ కోసం మ‌న కోసం తెలుగు  వెలుగు కోసం.. ఆల్ ద బెస్ట్ టు ఆల్..


రెండు శిఖ‌రాలు నేల‌కొరిగిపోయాయి.. రెండు తార‌లు నేల విడిచి నింగి చేరాయి. ఎలా చెప్పుకున్నా ఎంత‌ని చెప్పుకున్నా తెలుగు వారికి పాట ఓ సంప‌ద.. ఆ పాట‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేసిన వైదికులు ఆ ఇద్ద‌రూ..! ఒక‌రు ఎస్పీబీ మ‌రొక‌రు సిరివెన్నెల. ఇద్ద‌రి ప్రయా ణం కొద్దిపాటి రోజుల తేడాతోనే ముగిసిపోవ‌డం ఓ విధంగా ఎంత‌కూ ఎడ‌తెగ‌ని బాధ‌కు సంకేత‌మే! త‌నికెళ్ల భ‌రణి ఓ సంద‌ర్భంలో అన్న విధంగా సిరివెన్నెల సాహిత్యంలో శాశ్వ‌త‌త్వం ఉంటుంది అని! అవును! బాలు గానంలో అజ‌రామ‌ర గుణం ఉంటుంది అని కూడా మ‌నం ఆ మాట‌కు కొన‌సాగింపు మాట‌గా రాసుకోవ‌చ్చు. అనుకోవ‌చ్చు. అనుకుని సంతృప్త‌త పొంద‌నూవచ్చు. పాట ఏద యినా ప్రాణం పెట్టి రాయ‌డంలో గొప్ప‌ద‌నం సిరివెన్నెల‌కు, తాత్విక‌త ఆపాదించ‌డం సిరివెన్నెల‌కు తెలిసిన విద్య‌లు. ఆ పాటకు త‌నదైన గొంతుక ఇచ్చి సంద‌ర్భాన్నీ క‌వి హృద‌యాన్నీ అర్థం చేసుకోవ‌డం బాలు చేసే విద్య. బాలూ మాత్ర‌మే చేయ‌గ‌లిగే విద్య. తెలుగు వారి ఆస్తి వీరిద్ద‌రూ అని రాయ‌డం త‌ప్పు కాదు.. తెలుగు ఇంటి గౌర‌వం అని రాయ‌డంలో గొప్ప స‌త్భావ‌న ఒక‌టి దాగి ఉంది. స‌త్భావ‌న‌కు కొన‌సాగింపు ధోర‌ణిలో ఇవాళ నుంచి మ‌ళ్లీ పాడుతా తీయ‌గా ప్ర‌తి ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈటీవీలో ప్ర‌సారం కానుంది. ఆ ఆరంభానికి స్వాగతం ఆ కూజిత స్వ‌ర విన్యాస ధోర‌ణికి వంద‌నం. డియ‌ర్ బాలూ! ఎదుటా నీవే! ఎద‌లో నీవే!


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి: