
తాను నిద్ర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో దానినుండి ఉపశమనం పొందేందుకు గంజాయి తీసుకునేవాడినని ఆర్యన్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ తో పాటు మరో అయిదుగురు కూడా ఈ కేసులో చిక్కుకోగా, మరో 16 మంది పై ఆరోపణలు ఉండగా... ఆర్యన్ ఖాన్ మిగిలిన వారు వెల్లడించిన , అంగీకరించిన విషయాలతో పాటు దర్యాప్తులో గుర్తించిన అంశాలను కూడా జత చేసి ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. అయితే ఆర్యన్ ఖాన్ నిద్ర సంబంధిత సమస్యల కారణంగానే గంజాయి కి అలవాటు పడ్డట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఓ డ్రగ్ డీలర్ తనకు తెలుసని అంగీకరించిన ఆర్యన్ అయితే ఆ డ్రగ్ డీలర్ ఊరు అతడి వివరాలు తెలియదని పేర్కొన్నాడు.
ఆర్యన్ 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో గంజాయికి బాగా అలవాటు పడ్డాడట . అయితే ఇలా చేయమని ఏ డాక్టర్ కూడా సూచించలేదు అని తాను ఇంటర్నెట్ ద్వారా ఇందుకు పరిష్కారం గంజాయి అని తెలుసుకుని నా సమస్యకు గంజాయి ద్వారా పరిష్కారం వెతుక్కుని ఉపశమనం పొందాను అని ఆర్యన్ వెల్లడించినట్లు సమాచారం. అంతే కాకుండా పలు సార్లు లాస్‌ఏంజెలెస్‌లో పార్టీ వంటి సమయాలలో సరదాగా మారిజువానా తీసుకున్నట్టు స్వయంగా ఒప్పుకున్నాడు. అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించిన పలు నిజాలు బయటకు రావలసి ఉందని కొందరి అధికారులు చెబుతున్నారు.