* ఎంపీల గొంతుకతోనే ఏపీ రాష్ట్రాభివృద్ధి  

* అందరి ఆశలు రామ్మోహన్ నాయుడు మీదనే  

* ఈ యంగ్ అండ్ డైనమిక్ ఫండ్స్ తీసుకొచ్చే అవకాశం ఎక్కువ

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఇస్తే తీసుకునేది. ఇక పోలవరం ప్రాజెక్టు నిధులును కూడా కేంద్రం నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే 36 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు పై ఆశలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆయన పార్లమెంటులో అధికార ఎంపీగా ఏపీ రాష్ట్ర సమస్యలపై పోరాడిని ప్రాజెక్టులకు నిధులను తీసుకొచ్చే అవకాశం ఉంది.

రామ్మోహన్ నాయుడు 2024 నుంచి పౌర విమానయాన శాఖకు 34వ మంత్రిగా పనిచేస్తున్నారు. అంటే జాతీయ స్థాయిలో పౌర విమానయానానికి సంబంధించిన విషయాలకు ప్రాథమికంగా బాధ్యత వహిస్తారు. అయితే ఆయన రాష్ట్రస్థాయిలో ఎంపీగా కూడా గెలిచారు కాబట్టి ఈ పార్లమెంట్లోకి వెళ్లి రాష్ట్రానికి సంబంధించిన ఫండ్స్ కోసం బలంగా అడగవచ్చు. ఈయన లోక్‌సభలో టీడీపీ లీడర్. చాలా చురుకైన రాజకీయవేత్త. ఎప్పుడూ బాగా మాట్లాడుతుంటారు. కుర్రవాడు అయినా సరే విషయపరిజ్ఞానం ఎక్కువ ఉన్నవారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వయసు జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఒక ఆర్టికల్ కూడా రాశారు. సాండ్ మైనింగ్ మాఫియా గురించి ఆయన తన గొంతుకను వినిపించారు. 2024 లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే అఖండ విజయంలో రామ్ మోహన్ నాయుడు ముఖ్యమైన పాత్ర పోషించారు. రామ్ మోహన్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. శ్రీకాకుళం స్థానం నుంచి వైసీపీ పార్టీకి చెందిన పేరాడ తిలక్‌పై 3 లక్షల ఓట్లతో విజయం సాధించారు.

ఇటీవల రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు ని కలిసి బాల్‌ బాడ్మింటన్‌ ఆటకు జాతీయస్థాయి హోదా కల్పించాలని కూడా కోరారు. ఇకపోతే ఏపీ ప్రజలు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని బాగా ఆశిస్తున్నారు. అది చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. జగన్‌ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీన్ని నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో పోలవరం ప్రాజెక్టు కోసం నిధులను పదేపదే అడిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన వల్లే కేంద్రం నుంచి ఎంతో కొంత నిధులు తప్పనిసరిగా వస్తాయని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: