
తెలంగాణ దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించిందని రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ ఆలోచన జాతీయ విధానంగా రూపాంతరం చెందడం గొప్ప విషయమని ఆయన అన్నారు. తెలంగాణలో కులగణన చేపట్టి బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేశామని, ఈ చర్య దేశవ్యాప్తంగా ఓబీసీ సాధికారతకు స్ఫూర్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకత్వానికి అంకితమని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ చర్యలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కులగణన ద్వారా సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల సాధికారత సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ దీర్ఘకాల పోరాటం, తెలంగాణలో తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన కేంద్ర నిర్ణయానికి బలమైన ఆధారమని ఆయన అన్నారు. ఈ చొరవ దేశంలోని బడుగు వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన ఆకాంక్షించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు