
అయితే ఈ వీడియోలో రికార్డ్ అయిన ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకున్నదట. ఏప్రిల్ 12వ తేదీన రాత్రి 9:30 సమయాలలో గొండా జిల్లా బిజెపి అధ్యక్షుడిగా ఉన్న అమర్ కిషోర్ బాయ్ బాయ్ మహిళా కార్యకర్తతో కారులో నుంచి దిగి మరి పార్టీ కార్యాలయంలోకి చేరుకొని మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని ఆ తర్వాత మహిళతో కలిసి పై అంతస్తులో ఉండే గదిలోకి వెళ్లినట్లుగా చూపించారు. అయితే ఇది బిజెపి పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యిందట.
దీంతో ఈ వీడియో క్లిప్ తాజాగా వైరల్ గా మారడంతో బిజెపి నేత అమర్ కిషోర్ బాయ్ బాయ్ పై చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంతో బిజెపి నేత అమర్ కిషోర్ మాట్లాడుతూ ఈ వీడియోలో ఉన్నది తానే అయినప్పటికీ కూడా ఇది ఏప్రిల్ 12 నాటిదని కూడా తెలుపుతూ ఆ రోజు మహిళా కార్యకర్త సడన్గా అనారోగ్యానికి గురైంది.. ఏం చేయాలో తెలియక పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని సూచించానని.. ఒక మనిషిగా ఆ మహిళకు సహాయం చేశానంటూ అమర్ కిషోర్ తెలియజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తాను కొనసాగించడం కొంతమంది నేతలకు ఇష్టం లేదని.. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వీడియోని కూడా విడుదల చేశారు. వీటి వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని తెలిపారు.