
బొత్స సత్యనారాయణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అంతేకాకుండా ఆసుపత్రిలో బొత్స నడుస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియోని కూడా షేర్ చేశారు. బొత్స ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా ఫోన్లు రావడంతో అందరికీ తెలిసేలా ఇలా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు. బొత్స గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో వైసిపి ఎమ్మెల్సీగా గెలిపించుకొని మరి మండల విపక్ష హోదాని సైతం సంపాదించారు.
ఉత్తరాంధ్ర రాజకీయాలలో కీలకమైన నేతగా ఉన్న బొత్స గతంలో గుండె ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో ఈ రోజున ఆయన ఒక్కసారిగా ఇలా కుప్పకూలడంతో ఏం జరిగిందా అంటూ పలువురు వైసిపి శ్రేణులు ఆందోళన చెందారు.అయితే చివరికి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ఆయన కోలుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మరి ఇంటికి వెళతారా లేకపోతే వైద్యుల సంరక్షణలోనే ఉంటారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా అటు ఒకవైపు అధికార ప్రభుత్వం మరొకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మధ్య ఏదో ఒక విషయంలో వార్ కనిపిస్తూ ఉన్నది.