
టిడిపిలో కొంతమంది నేతలతో చేతులు కలిపి జనసేన ఎమ్మెల్యేలు లిక్కర్ సిండికేట్లను అలాగే బెల్టు షాపులను నడుపుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు ఇసుక తవ్వకాలు కూడా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ విషయాల పైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ నేతలను గమనిస్తున్నారా? లేదా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. చాలామంది నేతలపైన విమర్శలు వినిపిస్తున్న సమయంలో జనసేన పార్టీ అంటే అవినీతి రహిత పాలన చేస్తామంటూ ఎన్నికల సమయంలో తెలియజేశారు.
కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తమ నేతల మీద ఒక కన్నేసి ఉంచారనే టాక్ ఏపీలో వినిపిస్తోంది.. నమ్మకమైన కొంతమంది అధికారులతో కలిసి ఇప్పటికే కొంతమేరకు సమాచారాన్ని సేకరించారని మరి కొన్ని నెలలు వేచి చూసి.. ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నారని తెలుస్తోంది.. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను పార్టీలో వింటారా లేదా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.. గతంలో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే నే పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోలేకపోయారని ఇప్పుడు ఇంత మంది ఎమ్మెల్యేలను తన దారిలోకి ఎలా తెచ్చుకుంటారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నది.. ఒకవేళ జనసేన పార్టీ 2029 ఎన్నికలు టార్గెట్ అన్నట్టుగా వెళితే సక్సెస్ అవుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు.