
ప్రస్తుతం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు.. ఈ విషయం తెలిసిన నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు అయితే సోనియా గాంధీ ఆరోగ్య విషయం గురించి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి అధికారికంగా ప్రకటన కూడా తెలియజేయలేదు. కానీ సోనియా గాంధీ మాత్రం గత కొన్నేళ్లుగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈమె వయసు 78 సంవత్సరాలు. ఏడాది జూన్ 7వ తేదీన స్వల్ప ఆరోగ్య సమస్యలు వల్ల సిమ్లాలో మెడికల్ కాలేజ్ గా చికిత్స చేయించుకుంది.
అయితే అక్కడ వైద్య బృందం మాత్రం సోనియా గాంధీకి ఆరోగ్య పరీక్షలు సాధారణంగా నిర్వహించారు.ఆ తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. 2022లో కూడా సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో రెండు సార్లు చేరినట్లుగా సమాచారం. ఆ సమయంలో సోనియా గాంధీ శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొందని.. అలాగే వైరల్ ఫీవర్ వల్ల కూడా అలాగే కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఈమె ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు వినిపించాయి. మరి తాజాగా సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి గురించి రాహుల్ గాంధీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతాలలో తిరిగి పుంజుకొనేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలోను సోనియా గాంధీ ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.