ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క పిల్లాడి చేతిలో ఫోన్ ఉంటుంది.  మరీ ముఖ్యంగా ఐదో క్లాస్ కూడా దాటకముందే చేతిలో ఫోన్ పట్టుకొని తెగ తిరిగేస్తుంటారు . కొంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు.  సోషల్ మీడియా అనేది పాజిటివ్ గా ఉపయోగిస్తే పర్వాలేదు నెగటివ్గా ఉపయోగిస్తేనే తలనొప్పులన్నీ.  ఈ మధ్యకాలంలో ఎక్కువగా పోర్న్ వీడియోలు చూస్తున్న వాళ్ళ లిస్ట్ పెరిగిపోతుంది.  ఆన్లైన్లో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూనే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది . ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు అలాంటి వాళ్లకి సివియర్ వార్నింగ్ ఇచ్చారు.

 ఆన్లైన్లో చిన్నారుల అశ్లీల వీడియోలు చూసిన.. డౌన్లోడ్ చేసిన.. సెర్చ్ చేసిన ..ఎవరికైనా షేర్ చేసిన జైలుకు వెళ్ళకు తప్పదు అంటూ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు . హైదరాబాద్ . యాదగిరిగుట్ట . కరీంనగర్ ,జగిత్యాల , వరంగల్ జిల్లాలకు చెందిన సుమారు 15 మందిని బుధవారం అరెస్ట్ చేశామంటూ కూడా తెలిపారు . గురువారం బంజారాహిల్స్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు .

"ఈనెల 18 స్టార్ట్ చేసిన స్పెషల్ ఆపరేషన్ డార్క్ వెబ్ పై ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు . చిన్నారులకు సంబంధించి అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసిన.. డౌన్లోడ్ చేసిన .. షేర్ చేసిన..  అప్లోడ్ చేసిన వెంటనే అమెరికా కేంద్రంగా పనిచేసే నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయ్టెడ్ చిల్డ్రన్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో సైబర్ టిప్ లైన్ ద్వారా వాటిని ఈజీగా గుర్తిస్తామని చెప్పుకొచ్చారు . అలాగే ఈ ఏడాది చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏర్పాటు చేసి నాలుగు నెలల లోనే 294 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశాం అని.. అలాగే వాళ్లతో సంబంధం ఉన్న 110 మందిని అరెస్టు చేసామంటూ చెప్పుకొచ్చారు.  పట్టుబడిన వాళ్లంతా అశ్లీల వీడియోలో ఉన్న బాధితులు అంటూ చెప్పుకొచ్చారు . నిందితులలో 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారు ఉన్నారు అంటూ కూడా అని చెప్పుకొచ్చారు". ఇకపై ఎవరైనా సరే పోర్న్ వీడియోస్ చూసినా.. పోర్న్ వీడియోస్ అప్లోడ్ చేసిన .. పోర్న్ వీడియోస్ డౌన్లోడ్ చేసిన..  అలాంటి వీడియో షేర్ చేసిన కఠినంగా శిక్షిస్తామని వెంటనే జైలుకు పంపిస్తామంటూ తేల్చి చెప్పేశారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: