
టెహ్రాన్ లో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని కూడా చెప్పుకోచ్చింది .. ఇలా చాలా ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు కూడా వెల్లడించింది .. ఇరాన్ మిస్సైల్స్ దూసుకొస్తున్నాయని ..ప్రజలు సురక్షితప్రాంతాలకు వెళ్ళాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది. జెరూసలెం , బీర్ షెబా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందని ఐడీఎఫ్ తెలిపింది. బీర్‌షెబాలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. అందులోని ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు ఇరాన్ 6 క్షిపణులను ప్రయోగించినట్లు ఐడీఎఫ్ చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ ఆర్మీ స్థావరాల మీద కూడా వరుస దాడులు చేస్తుంది ..
ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతటా పెద్ద పెద్ద పేలుళ్లు శబ్దాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి .. అలాగే బాగ్దాద్ కు ఉత్తరాన ఉన్న అమెరికన్ సైనిక స్థావరమైన క్యాంప్ తాజిని లక్ష్యంగా చేసుకొ ఇరాన్ డ్రోన్లతో విరుచుకుబడింది .. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్నారు .. అలాగే AFP నివేదిక ప్రకారం , డ్రోన్ సైనిక స్థావరంలోని రాడార్ వ్యవస్థను ఢీకొందని స్థానిక స్థావరం డిస్టర్బ్ అయిందని కూడాAFP నివేదిక చెబుతుంది .. అలాగే ఇజ్రాయిల్ , ఇరాన్ కి యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది .. ఇజ్రాయిల్ తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి చెప్పుకొచ్చారు .. అలాగే ఇజ్రాయిల్ , ఇరాన్ పై యుద్ధాన్ని మొదలుపెట్టింది .. మా ప్రజలపై దాడులు చేస్తే మేము ప్రతి దాడులను కొనసాగించామని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు .. అలాగే మా సైనిక చర్యల విరమణ పై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటామని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ..