తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు. రాష్ట్రాన్ని సిద్ధింపజేసి  9 సంవత్సరాల పాటు ప్రజలకు పాలన అందించారు. అలాంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయనతో సొంత కుటుంబ సభ్యులైనా మాట్లాడడానికి భయపడేవారు. ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు,సంతోష్ రావు, కవిత మధ్య రాష్ట్ర రాజకీయమంతా నడిచింది. ఏ నిర్ణయాలైనా ఈ కుటుంబ సభ్యులు  మాట్లాడుకొని  ముందుకు వెళ్లేవారు. ఈ విధంగా వారు అధికారంలో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా రాష్ట్రాన్ని పాలించారు. కానీ మొన్నటి ఎలక్షన్స్ లో  జనాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి అధికారంలోకి తీసుకువచ్చారు. ఇదే సమయంలో కవిత కూడా లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి కొన్నాళ్లపాటు జైల్లో ఉండి రిలీజ్ అయింది. ఇక ఈమె ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొన్నదో అప్పటినుంచి కేసీఆర్ ఆమెని పక్కన పెట్టడం మొదలుపెట్టారు.

 దీంతో విసుగు చెందిన కవిత  వారి కుటుంబంతో కాస్త విభేదాలు పెట్టుకుంటూ వస్తోంది. చివరికి జాగృతి పేరుతో కొత్త పార్టీని కూడా అనౌన్స్ చేసింది. అలాగే కేటీఆర్ ను,హరీష్ రావును,సంతోష్ రావులను నిందించింది. ఇంతలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ అవ్వడంతో కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్ రావు, సంతోష్ రావు కేసీఆర్ కు మరక అంటించాలని చూస్తున్నారని చెప్పింది.. ఇదే క్రమంలో కోపానికి వచ్చినటువంటి కేసీఆర్  ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. కట్ చేస్తే కవిత ఈ విధంగా కుటుంబంపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడానికి బలమైన కారణం ఉందని అంటున్నారు.

అయితే ఆస్తుల పంపకం విషయంలో కవితకు  కేసీఆర్ మొండి చేయి చూపించారని తెలుస్తోంది. ఆమె ఆస్తులు పంచాలని కేసీఆర్ కు చెప్పినట్టు సమాచారం. కేసీఆర్ దీనికి ససేమిరా అనడంతో ఆమె తిరుగుబాటు మొదలు పెట్టింది. ఆస్తులు పంచుతారా.. లేదంటే మీ అవినీతి బయటపెట్టాలా అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా కేసీఆర్ ను బ్లాక్మెయిల్ చేస్తూ తనకి రావలసిన వాటా తనకి ఇవ్వాలని  కవిత వార్నింగ్ ఇస్తుందట. మరి చూడాలి కేసీఆర్ కవితకు లొంగిపోయి ఆమె నిర్ణయం ప్రకారం ఆమెకు రావాల్సిన వాటా ఇస్తారా.. లేదంటే ఆమెతో ఏం కాదని సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: