ప్రస్తుతం ఉన్న కాలంలో అబ్బాయిలకు వివాహం కావడం అనేది చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా ఇంటర్ క్యాస్ట్ వివాహం చేసుకోవాలనుకున్నప్పటికీ చాలామంది మోసం చేస్తున్నారనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నారు. వివాహమైన కొన్ని నెలలకే విడాకులు కావాలని భర్త నుంచి భారీగానే భరణాన్ని పొందుతున్నారు. అందుకే చాలామంది ఆలస్యంగానే వివాహం చేసుకోవడానికి మక్కువ చూపుతున్నారు.


ఇటివల కాలంలో ఆంధ్రాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది. ఒక అబ్బాయికి నెలకి రూ.50వేల రూపాయలు జీతం, సొంత ఇల్లు, దాని విలువ  రూ.25 లక్షల రూపాయలు. అయితే ఈ అబ్బాయి ఓసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఓసి క్యాస్ట్ లో అయితే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి  రాకపోవడంతో, సరే ఇతర క్యాస్టులలో వివాహం చేసుకోవాలని అనుకున్నప్పటికీ, అలా వారి బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు పనిచేసే అమ్మాయి కూతురిని  వివాహం చేసుకోవడానికి అడగగా, వారు కూడా ఆస్తి గురించి అన్ని అడగగా, 50వేల రూపాయల జీతం సంపాదించే వాడితో  సుఖంగా , ఆనందంగా జీవించలేనని ఎక్కువ జీవితంలో వచ్చే వారిని వివాహం చేసుకుంటానంటూ చెప్పేసిందట.


గతంలో అయితే అబ్బాయి, అమ్మాయి కలిసి కష్టపడి సంపాదించుకునేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మాత్రం అందుకు భిన్నంగా మారిపోతోంది. ఇప్పటికీ పల్లెలలో వారు పట్టణం అబ్బాయిలను వివాహం చేసుకోవాలని, పట్టణంలో మహిళలు మెట్రో అబ్బాయిలను చేసుకుంటున్నారు. వీటికి తోడు ప్రతి శని, ఆదివారాలలో బయటికి తీసుకెళ్తూ ఉండాలి. ఇక డబ్బులు లక్షలకు లక్షలు చేతిలోనే ఉండాలి. ఏది అడిగిన కొనిపెట్టే రీతిలో ఉండాలి. అప్పుడప్పుడు ట్రిప్పులకు తీసుకువెళ్తూ ఉండాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా కూడా గొడవలు పడుతుంటారు. ఇది కాస్త రెండు కుటుంబాల మధ్య మానసిక ఘర్షణగా మరి విడాకులకు కారణమవుతుంది. ఇప్పుడు బెంగళూరు వంటి ప్రాంతాలలో కారు లేని అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడడం లేదట. పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా కారు ఉండాల్సిందే అంటూ కండిషన్స్ పెడుతున్నారు. ప్లస్ లక్ష రూపాయలు జీతం తగ్గకూడదు, అలాగే కారు కూడా మెయింటైన్ చేయాలి అనే కండిషన్ ని పెడుతున్నారట. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: