ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అంతా గజిబిజి .. గందరగోళం మారిందని తెలుగు తమ్ముళ్లే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయిలో చాలా చోట్ల కార్యకర్తల కంటే వైసీపీ నుంచి వచ్చిన వారికే విలువ ఉంటోందని వాపోతున్నారు. దాదాపు చాలా నియోజకవర్గాల్లో పార్టీ కోసం గత ఐదేళ్లుగా కష్టపడిన వారిని ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలు పూర్తిగా పక్కన పెట్టేసి వారి వ్యక్తిగత స్వార్థ లాభం కోసం వెళుతున్నారు. దీంతో కేడర్ ఆవేదన వర్ణనాతీతం. అసలు పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు విలువ లేదు.. ఎమ్మెల్యేలు డబ్బులు .. కమీషన్లు ఇచ్చే వాడినే దగ్గరకు చేరదీస్తున్నారు.
ఇప్పటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న తిరువూరు రాజకీయం ఇప్పుడు ఏకంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే పోరుగా మారి ఇద్దరు నేరుగానే ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుని వీథికి ఎక్కే పరిస్థితి వచ్చేసింది. దీంతో పార్టీ పరువు రాష్ట్ర వ్యాప్తంగా బజారున పడింది. చాలా చోట్ల ప్రధాన నాయకులే వైసీపీ వాళ్లతో కుమ్మక్కు అయ్యారని అంటున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నాయకులకు డబ్బులు తీసుకుని పనులు చేస్తూ పార్టీనే ఏళ్ల పాటు నమ్ముకుని వారికి నిలువునా అన్యాయం చేస్తున్నారు.
చాలా మంది ఎమ్మెల్యేలు బాహాటంగానే డబ్బులు తీసుకుంటున్నారు అనే ప్రచారం కూడా గట్టిగా ఉంది. ఈ ప్రచారంతో వైసీపీ - టీడీపీ ఇద్దరూ ఒక్కటే అనే భావన ప్రజల్లోకి బలంగా వెళుతోంది. ఇది నిజమైన హార్ట్ కోర్ తెలుగు తమ్మళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే కొనసాగితే మరోసారి టీడీపీ కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని ఎలా నమ్ముతారు ? అన్న ప్రశ్నలు .. చర్చలు కూడా నలుగుతున్నాయి. 2019 నుంచి మనం ఏమేం నేర్చుకున్నాం ఇలా అయితే 2029 లోనూ మరోసారి 2019 ఫలితమే రిపీట్ అవుతుందని టీడీపీ డై హార్ట్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ ఇప్పటకి అయినా ఇలాంటి వాటిని కట్టడి చేయలేకపోతే భవిష్యత్తులో ఆయన పొలిటికల్ కెరీర్‌కే ఇబ్బంది అవుతుందని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి