భారత్ టీ20 జట్టు పగ్గాలు రోహిత్ శర్మ చేతికి అప్పగించాలని గత రెండేళ్ల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా రోహిత్ శర్మని భారత్ టీ 20 జట్టు కెప్టెన్ గా  ప్రకటించారు. అయితే కొంత మంది మాజీ క్రికెటర్లు పరోక్షంగా ఈ విషయాన్ని తమ డ్రీమ్ రోహిత్ ని కెప్టెన్ గా ఎంపిక చేయడం అని  పరోక్షంగా వెల్లడిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రకటించిన వరల్డ్ టీ 20 కెప్టెన్ గా  భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అయితే దీనితో రోహిత్ శర్మను ఓపెనర్ గా ఎంపిక చేయడంతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించాడు టామ్ మూడి.

 

టామ్ మూడీ వరల్డ్‌ టీ20 ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, జోప్రా ఆర్చర్, రవీంద్ర జడేజా

 

ఈ జట్టులో ధోనీకి చోటు దక్కలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్ ని ఎంపిక చేసాడు  ఎందుకు ఇలా ఎంపిక చేసాడు అంటే కుడి ఎడమ కాంబినేషన్ కోసమే అని వివరించాడు. ఇదిలా ఉండగా నెంబర్ త్రీ లో విరాట్ కోహ్లీ, నెంబర్ ఫోర్ లో ఏబీ డివిలియర్స్ కి అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత నెంబర్ ఫైవ్ లో తొలుత ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ ని ఎంపిక చేయాలని భావించాడు. కానీ మిడిలార్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ కావాలని ఆశించి బట్లర్ కి బదులుగా వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ ని సెలెక్ట్ చేశాడు.

 

ఆ తర్వాత నెంబర్ సిక్స్ లో ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ ని ఎంపిక చేశాడు. తరువాత రషీద్ ఖాన్, సునీల్ నరైన్ రూపంలో స్పిన్నర్లు కి అవకాశం ఇచ్చాడు. పన్నెండవ బ్యాట్స్ మ్యాన్ గా జడేజా కి అవకాశం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: