నేటి నుంచి టీమిండియా వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడబోతుంది. సొంతగడ్డపై ఆడబోతున్న ఇక ఈ వన్డే సిరీస్పై భారీగానే ఆశలు పెట్టుకుంది టీమిండియా. ఇటీవలే సౌత్ ఆఫ్రికా పర్యటనలో వరుస ఓటములతో నిరాశ ఎదురవగా.. ఈసారి మాత్రం గెలిచి సత్తా చాటాలని నిర్ణయించుకుంది. కాగా మొన్నటివరకు గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ ఇప్పుడు గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టాడు. అదే సమయంలో మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మాత్రం కేవలం ఒక సాదాసీదా ఆటగాడిగా మాత్రమే మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతున్నాడు.



 కాగా మొదటి సారి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ప్రపంచ క్రికెట్లో వన్డే ఫార్మాట్ చరిత్రలోనే మొదటిసారిగా టీమిండియా ఏకంగా 1000 వ మ్యాచ్ ఆడబోతుంది. వెస్టిండీస్తో జరగబోయే మొదటి మ్యాచ్ 100వ వన్డే క్రికెట్ మ్యాచ్ కావడం గమనార్హం.  ఇక ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్లో టీమిండియా ఎలా రాణించ పోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. రోహిత్ శర్మ తన కెప్టెన్సీ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అని క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 ఇకపోతే ఇప్పటి వరకూ 999 వన్డే మ్యాచ్లు ఆడింది టీమిండియా. ఇక గణాంకాలు చూసుకుంటే 518 మ్యాచుల్లో విజయం సాధించింది టీమిండియా. 431 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక 9 మ్యాచ్ను టైగా ముగిసాయ్. నలభై ఒక మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఇక వన్డే క్రికెట్లో టీమిండియా అత్యధిక స్కోరు 418/ 5 కావడం గమనార్హం. వెస్టిండీస్పై 2011లో ఈ ఫీట్ సాధించింది టీమిండియా. వన్డేల్లో హక్కువ  స్కోర్ 54/10 2009లో శ్రీలంకపై ఈ చెత్త రికార్డు నమోదు చేసింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు 334 అనిల్ కుంబ్లే తీయగా 18,426 పరుగులు తో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా సచిన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా 2007లో బెర్ముడా పై 257 పరుగుల అత్యధిక స్కోరు తో వన్డేలో విజయం సాధించింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: