రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత టీమిండియాను ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నాడూ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి మ్యాచ్లో కూడా తనదైన వ్యూహాలతో జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు రోహిత్ శర్మ. ఇకపోతే మొన్నటికి మొన్న వెస్టిండీస్ జట్టుపై వన్డే టి20 సిరీస్ లలో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి వెస్టిండీస్కు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా క్లీన్స్వీప్ చేసింది టీమిండియా.


 ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో కూడా రోహిత్ సేన అద్భుతంగా అదరగొట్టింది అనే చెప్పాలి. లక్నో వేదికగా శ్రీలంకతో తొలి టీ-20 మ్యాచ్ జరుగగా ఏకంగా 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాకుండా ఓపెనర్ ఇషాన్ కిషన్ సూపర్ సక్సెస్ అయి కేవలం 57 బంతుల్లోనే 89 పరుగులు చేసి రాణించాడు. ఇక రోహిత్ శర్మ 44 పరుగులు శ్రేయస్ అయ్యర్ 57 పరుగులతో రాణించారు అని చెప్పాలి. ఇలా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 పరుగుల చేసింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్కు దిగింది. అయితే భారత బౌలర్లు విజృంభించడంతో 6 వికెట్ల నష్టానికి 137 పరుగుల చేయగలిగింది శ్రీలంక.


 దీంతో 63 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే ఇంత గొప్ప విజయం సాధించిన తర్వాత కూడా అటు రోహిత్ శర్మ లో ఒక అసంతృప్తి అలాగే మిగిలిపోయిందట. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ శ్రీలంకతో టీ20 మ్యాచ్లో విజయం సాధించడం సంతోషమే. కానీ ఒక్క విషయం నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. టీమిండియా ఫీలింగ్ అనుకున్నంత ప్రమాణాల్లో లేదు. మ్యాచ్లో కొన్ని ఈసీ క్యాచ్ లు జార విడిచాము.. ఇక రానున్న మ్యాచ్ లలో ఫీల్డింగ్ పై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. దీని కోసం ప్రాక్టీస్ సెషన్లో ఫీల్డింగ్ కోచ్ తో సంప్రదింపులు జరిపి ఎక్కువ సమయం ఫీల్డింగ్ లో మెరుగుపడటానికి కేటాయిస్తాము.. రానున్న వరల్డ్ కప్లో టీమ్ ఇండియా ఫీల్డింగ్ లో బెస్ట్ టీం గా తయారవ్వాలి అంటూ చెప్పుకొచ్చాడు  రోహిత్ శర్మ..

మరింత సమాచారం తెలుసుకోండి: