ఇటీవల దేశ వాలి క్రికెట్లో ఎంతో రసవత్తరంగా  సాగిన దిలీప్ ట్రోఫీ ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన పోరు జరిగేందుకు అంత సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో ఇరానీ కప్ జరగబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఈ టోర్న నిర్వహణకు సంబంధించి ఇటీవల షెడ్యూల్ ఖరారు అయింది. గుజరాత్ లోని రాజ్కోట్ లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఇందులో భాగంగా 2019 - 20 రంజి ట్రోఫీ ఛాంపియన్స్ సౌరాష్ట్ర రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు మ్యాచ్లో తలబడబోతున్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ మ్యాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు సభ్యుల వివరాలను తెలిపింది. సౌరాష్ట్ర జట్టుతో పోటీ పడబోయే 16 మంది సభ్యులతో కూడిన జట్టును మీడియా వేదికగా ప్రకటించగా తెలుగు క్రికెటర్ హనుమ విహారికి కెప్టెన్గా అవకాశం కల్పించింది బీసీసీఐ.  ఇక మరో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ కూడా జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇటీవలే ముగిసిన దులిప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్ జోన్ జట్టులో ఉన్న ప్రియాంక్ పాంచల్, యశస్వి జైస్వాల్, యష్ దుల్ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను సైతం జట్టులోకి తీసుకున్నారు.


 అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నిర్వహించడం లేదు అన్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు కరోనా ప్రభావం తగ్గడంతో ఇక ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది అని చెప్పాలి.

 కాగా బీసీసీఐ ప్రకటించిన రెస్టాఫ్‌ ఇండియా జట్టు:
హనుమ విహారి(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ప్రియాంక్‌ పాంచల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, యశ్‌ ధుల్‌, సర్పరాజ్‌ ఖాన్‌, యశస్వి జైశ్వాల్‌, కేఎస్‌ భరత్‌, ఉపేంద్ర యాదవ్‌, జయంత్‌ యాదవ్‌, సౌరభ్‌ కుమార్‌, ఆర్‌ సాయికిషోర్‌, ముకేశ్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్దీప్‌ సేన్‌, అర్జాన్‌ నాగ్వస్వల్లా.

మరింత సమాచారం తెలుసుకోండి: