ఎన్టీఆర్ , ఏఎన్నార్, శోభన్ బాబు కాలం లో స్టార్ కమీడియన్గా కొనసాగిన నటుడు ఎవరు అంటే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి చెబుతాడు ఆ కమెడియన్ ఎవరో కాదు రాజ బాబు అని.. తనదైన హా వభావాలతో కమీడియన్గా ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎలాంటి పాత్ర లోనైనా సరే పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగల సత్తా ఉన్న నటుడు రాజబాబు అని చెప్పాలి. అప్పట్లో ఆయన ఎంత బిజీగా ఉండేవాడు అంటే రోజులో 20 గంటల పాటు షూటింగ్లో పాల్గొనే వాడు అంటే ఇక ఎన్ని సినిమాల్లో నటించేవాడు అర్థం చేసుకోవచ్చు.


 చిత్ర పరిశ్రమలు నవ్వుల రారాజుగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇంటర్ వరకు చదువు పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్న సమయం లోనే కుక్కపిల్ల దొరికిందా, నాలుగిళ్ల చావిడి, అల్లూరి సీతా రామరాజు లాంటి నాటకాలలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. 1960లో సమాజం అనే సినిమా ద్వారా నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. 1962లో వచ్చిన భీష్మ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 1980 ఫిబ్రవరి 7వ తేదీన అనారోగ్యంతో మరణించారు రాజబాబు. ఆయన మరణించిన ఇప్పటికీ ప్రేక్షకుల గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారు.


 కాగా 1965 డిసెంబర్ 5వ తేదీన లక్ష్మీ అమ్ములను వివాహం చేసుకున్నారు రాజబాబు. ఇక ఈయనకి ఇద్దరు కొడుకులు. వారి పేరు నాగేంద్రబాబు, మహేష్ బాబు. అయితే రాజబాబు మరణించిన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా అమెరికా వెళ్ళిపోయారు.  ఇక అక్కడ నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారట. ఇండియాలో కూడా కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయట. ఇటీవల కాలంలో ప్రతి మనిషి జీవితంలో భాగమైన జిపిఆర్ఎస్ సిస్టం వీళ్లు తయారు చేసిందేనట. ఇలా రాజబాబు ఇద్దరు కొడుకులు కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి: