ఖతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ప్రస్తుతం ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్ కూడా నరాల తెగే ఉత్కంఠ మధ్య ప్రేక్షకులకు అసలు సిసులైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు అయితే చివరి నిమిషం వరకు కూడా ఏ జట్టు విజేతగా నిలుస్తుంది అన్నది ప్రేక్షకులకు ఊహకందని విధంగానే మారిపోతోంది. ఈ క్రమంలోనే ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో కూడా ప్రేక్షకులు అంచనా వేయలేకపోతున్నారు. క్రీడా ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. ఇలా ప్రపంచ దేశాలు మొత్తం ఫిఫా వరల్డ్ కప్ మేనియాలోనే మునిగిపోయాయి.


 ఇకపోతే ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఛాంపియన్ అర్జెంటీనా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇక అర్జెంటినాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న లియోనాల మెస్సి కి ఇదే చివరి వరల్డ్ కప్ అని అభిమానులు భావిస్తున్న నేపథ్యంలో ఈసారి అర్జెంటీనా  కప్పు గెలిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. కానీ మొదటి మ్యాచ్ లోనే అర్జెంటీనా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఏకంగా సౌదీ అరేబియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే సౌదీ అరేబియా చేతిలో ఓడిపోయిన అర్జెంటీనా  జట్టు అటు మెక్సికోతో జరిగిన మ్యాచ్లో మాత్రం తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ పై అందరూ దృష్టి ఉంది. కాగా మరోసారి మెస్సి తన జట్టును ఇక వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించకుండా నిలబెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో ఇరుజట్లు ఒక గోల్ కూడా సాధించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. సెకండ్ హాఫ్ లో మెస్సి ఒక సూపర్ గోల్ కొట్టి  ఫ్యాన్స్ లో ఉన్న టెన్షన్ పోగొట్టాడు. ఇక ఆ తర్వాత ఫర్నేండెజ్ కూడా మరో గోల్కొట్టడంతో అర్జెంటీనా  2-0 తేడాతో గెలుపొంది ఇక వరల్డ్ కప్ లో నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: