
కానీ ఫిఫా వరల్డ్ కప్ లో మాత్రం ప్రేక్షకులు అంచనాలు మొత్తం తారుమారు అవుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే బాగా రాణిస్తాయి అనుకున్న జట్లు వరుస ఓటములు చవిచూస్తూ చివరికి టోర్ని నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నాయి. కానీ ఇప్పటికే కతార్ వేదికగా జరుగుతుండగా ఆతిథ్య ఖాతార్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. చివరికి మరో జట్టు ఫిఫా వరల్డ్ కప్ నుండి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
తన 36 ఏళ్ల ఫుట్బాల్ ప్రస్థానం లో తొలి సారి ఫిఫా వరల్డ్ కప్ ఆడుతుంది కెనడా జట్టు. దీంతో వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ క్రోయేషియా తో జరిగిన జరిగిన మ్యాచ్ లో 1-4 తేడాతో ఓటమి చవి చూసింది కెనడా జట్టు. ఇక అంతకు ముందు కెనడా ఆడిన తొలి మ్యాచ్లో కూడా ఓడి పోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో రెండు ఓటము లతో ఫిఫా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన రెండవ జట్టుగా నిలిచింది కెనడా. అయితే ఇక కెనడా జట్టు వరల్డ్ కప్ నుంచి ఇంటి బాట పట్టడంతో ఆ దేశ అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగి పోయారు అని చెప్పాలి.