సాధారణంగా గల్లీ క్రికెట్ లో ఎన్నో ఫన్నీ ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎవరు ముందుగా బ్యాటింగ్ చేయాలి అనే విషయంపై వివిధ పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు గల్లి క్రికెట్లో ఉండే ఆటగాళ్లు. ఈ క్రమంలోనే ఒక పిల్లాడు వంగితే ఏకంగా వాడి వీపుపై చేతుల సంఖ్యలను చూపిస్తూ  ఎవరు ఏ స్థానంలో ఆడుతారు అన్న విషయంపై కూడా నిర్ణయం తీసుకునేవారు. ఇంకొంతమంది ఏకంగా బ్యాటును అడ్డుగా  పెట్టి మట్టిలో కొన్ని అంకెలు రాసి ఇక వాటి అవతల గీతలు గీసి ఇక ఆటగాళ్లందరూ వాటిపై వేలు పెడితే.. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి అన్నది నిర్ణయించేవారు.


 గల్లి క్రికెట్లో జరిగే ఇలాంటి ఘటనలు ఎంతో సరదాగా ఉంటాయని చెప్పాలి.. కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటివి అస్సలు జరగవు. ఎందుకంటే ఎన్నో వ్యూహాలు ఇంకెన్నో ప్రణాళికలతో అన్ని ముందే అనుకొని బరిలోకి దిగుతూ ఉంటారు ఆటగాళ్లు. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి గల్లీ క్రికెట్ ఘటనే జరిగింది. అబుదాబి టి10 లీగ్ లో భాగంగా టీం అబుదాబి జట్టు ఓపెనర్లుగా ఉన్న అలెక్స్ హేల్స్, క్రిస్ లీన్ వ్యవహార శైలి కాస్త ట్విటర్లో వైరల్ గా మారిపోయింది.  ఇద్దరు బ్యాట్స్మెన్లు కూడా క్రీజులోకి వచ్చిన తర్వాత ముందుగా ఎవరు స్ట్రైక్ తీసుకోవాలి అనే విషయంపై మైదానంలోనే చిన్న గేమ్ ఆడారు.


 ఆ గేమ్ ఏంటో కాదు అందరికీ తెలిసిన రాక్ పేపర్ సీజర్స్. ఈ గేమ్ ఆడిన తర్వాత గెలిచిన అలెక్స్ హేల్స్ స్ట్రైక్ తీసుకున్నాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ట్విట్టర్లో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇది చూసిన కొంతమంది అభిమానులు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో గల్లీ క్రికెటర్లలా ఇలాంటి ఆటలు ఏంటి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది గల్లి క్రికెట్ ఆడిన మధుర క్షణాలు గుర్తొచ్చాయో ఏమో అందుకే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో కూడా మళ్లీ అలాంటిదే చేశారు అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: