టీమిండియా యువ సంచలనం సూర్య కుమార్ యాదవ్ గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్లో ఎంతల హాట్ టాపిక్ గా మారిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వీరోచితమైన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను  చేశాడు అని చెప్పాలి. ఇక ఈ ఏడాది మొత్తం సూర్యకుమార్ ప్రదర్శన అసమాన్యంగా సాగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో కూడా టీమిండియా సెమీఫైనల్ వరకు వెళ్లిందంటే అందులో సూర్య కుమార్తె కీలక పాత్ర ఉంది అని చెప్పాలి.



 అయితే వరల్డ్ కప్ లో భాగంగా విరాట్ కోహ్లీతో కలిసి టీమ్ ఇండియాకు ఎంతో అద్భుతమైన విజయాలను అందించాడు సూర్య కుమార్ యాదవ్. అంతేకాదు  కేవలం ఏడాది కాలంలోనే తన అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా టి20 ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెంబర్వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇలా సూర్యకుమార్ బ్యాటింగ్ విధ్వంసమే ప్రస్తుతం అతన్ని ఐసిసి టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో నిలిచేలా చేసింది అని చెప్పాలి.  ఈ ఏడాది టి20 క్రికెట్లో అసమాన్యమైన ఫామ్ కొనసాగించిన ఆటగాళ్లను ఐసిసి అవార్డులతో సత్కరించేందుకు సిద్ధమవుంది. ఈ క్రమంలోనే ఐసీసీ మెన్స్ 2022 టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినేషన్ ఆటగాళ్ల జాబితాను ఇటీవల ప్రకటించింది.

 ఇందులో సూర్య కుమార్ సహ మరో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరణ్, పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజాలు పోటీ పడుతున్నారు.  అయితే ఈ ఏడాది టీ20లలో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా సూర్యకుమార్ నిలిచాడు. 31 మ్యాచ్లలో 1164 పరుగులు చేశాడు. ఇక పొట్టి క్రికెట్లో సూర్యకుమార్ అత్యధికంగా 68 సిక్సర్లు కొట్టిన వీరుడుగా కొనసాగుతున్నాడు. అంతేకాదు ప్రస్తుతం వరల్డ్ నెంబర్వన్ గా కూడా సూర్యకుమారే ఉన్నాడు. దీని బట్టి ఇక ఐసీసీ మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సూర్య కుమార్కు దక్కడం ఖాయం అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: