ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు ఇక ఆతిథ్య  టీమిండియాతో వరుసగా సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్లలో అటు భారత జట్టు స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుని అద్భుతంగా రానించడం ఖాయమని అందరూ భావించారు. ఊహించినట్లుగానే ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా శుభారంభం  చేసింది అని చెప్పాలి. సీనియర్లు ఎవరూ లేకుండానే యువ ఆటగాళ్ళతో బరిలోకి దిగింది టీం ఇండియా. ఈ క్రమంలోనే యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టాడు.


 కాగా అటు భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకకు మెరుగైన ప్రదర్శనతో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమ్ ఇండియా జట్టు రెండు మ్యాచ్లలో విజయం సాధించి 2-1 తేడాతో ఇక సిరీస్ కైవసం చేసుకుంది. ఇకగా నేటి నుంచి అటు టీమిండియా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే.  నేడు మొదటి మ్యాచ్ జరగబోతుంది. ఇకపోతే ఇక వన్డే మ్యాచ్లో ప్లేయింగ్ 11 జట్టులో  ఇషాన్ కిషన్కు చోటు లేదు అని.. గిల్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తాడని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు.


 అయితే ఈ నిర్ణయం పై అటు అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇంకా ఏం చేస్తే టీమిండియాలోకి తీసుకుంటారు. డబుల్ సెంచరీ చేసి అదరగొట్టిన పక్కకు పెడితే.. ఆటగాళ్ల పరిస్థితి ఏంటి అంటూ సూటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. టి20 సిరీస్ లో శుభమన్ గిల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ అతన్నే మళ్ళీ జట్టులోకి పెట్టుకున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి బాగా ఆడితే జట్టులోకి తీసుకోలేము అనే మెసేజ్ ఇస్తున్నారా.. లేదా టీమిండియా సెలక్షన్ విషయంలో రాజకీయాలు చేస్తున్నారా అంటూ ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: