
ఇండియా ఆడిన ప్రతి సిరీస్ సమయంలో తనకు చోటు దక్కుతున్న ఎంతో ఆశగా ఎదురు చూడటం చివరికి నిరాశతో ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నాడు. అయితే ఇలా టీమ్ ఇండియాలోకి తనను ఎంపిక చేయడం లేదు అన్న కసితో ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా తన బ్యాట్ తో దంచి కొడుతున్నాడు అని చెప్పాలి. సెంచరీలు డబుల్ సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇక ఇటీవల ఏకంగా త్రిబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఇక పృథ్వి షా చెలరేగిపోతున్న తీరు చూస్తే అతను 400 స్కోర్ సాధించడం కూడా కష్టమేమీ కాదు అని అందరూ భావించారు. కానీ 400 పరుగులకు కొన్ని పరుగుల దూరంలోనే అతను ఆగిపోయాడు.
ఇకపోతే ఇటీవలే రంజి ట్రోఫీలో భాగంగా రెండో అత్యధిక స్కోరు సాధించిన పృథ్వి షాపై బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రశంసలు కురిపించాడు. పృద్విషా ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. అతడు అపారమైన సామర్థ్యం కలిగిన ప్రతిభావంతుడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక అతన్ని చూసి గర్వపడుతున్న అంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించిన పృథ్వి షా మీ మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. లక్ష్యాన్ని చేరుకునేంతవరకు కష్టపడుతూనే ఉంటాను అంటూ పృథ్వి షా చెప్పుకొచ్చాడు.