
ఈ క్రమంలోనే కప్పు కొట్టేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇక అతడు తమ జట్టులో ఉంటే జట్టు ఎంతో పటిష్టంగా ఉంటుందని ఇక జట్టు విజయంలో అతడు ఎంతో కీలక పాత్ర వహిస్తాడని నమ్మకం పెట్టుకొని ఇతర జట్ల ఫ్రాంచైజీలతో పోటీపడి మరి సామ్ కరన్ 18.5 కోట్లు పెట్టి భారీ ధరకు కొనుగోలు చేసింది అని చెప్పాలి. ఇక అంతకుముందు ఏడాదిలో అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాడు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు సామ్ కరన్ ఫామ్ అటు పంజాబ్ కింగ్స్ జట్టును కలవరపెడుతుంది అని చెప్పుకొచ్చాడు ఆకాశ చోప్రా.
ఇటీవల ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టు తరఫున ఆడుతున్నాడు సామ్ కరన్. అయితే అతను బ్యాటింగ్ బౌలింగ్ లోను పెద్దగా ఆకట్టుకోలేక పేలవమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టును మాత్రమే కాదు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీని కూడా సామ్ కరన్ ఫామ్ కలవరపెడుతుందంటూ ఆకాశ చోప్రా చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సామ్ కరన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ అతన్ని పంజాబ్ కింగ్స్ భారీ ధర పెట్టి కొనుక్కుంది. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని అనుకుంటుంది. ఇలాంటి సమయంలో సామ్ కరన్ ఫామ్ ఆ జట్టును భయపెడుతుంది అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.