2023 ఏడాదిలో భారత జట్టు ఇక వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ ద్వైపాక్షిక సిరీస్ లకు సంబంధించిన జట్టు వివరాలను కూడా ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇటీవల కొత్త సెలక్షన్ కమిటీ అధ్యక్షుడిగా మళ్లీ చేతన్ శర్మ ఎంపిక కావడం..  ఇక అతని ఆధ్వర్యంలోనే కొత్త జట్ల ఎంపిక జరగడం ఇటీవల జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల చివరి నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా అటు భారత పర్యటనకు రాబోతున్న న్యూజిలాండ్తో టి20 వన్డే సిరీస్ ఆడబోతుంది టీమ్ ఇండియా జట్టు.


 ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఈ రెండు సిరీస్ లు ముగిసిన వెంటనే అటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అటు భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ భారత్ వేదికగా ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందుకు సంబంధించిన జట్టు వివరాలను ఇటీవల ప్రకటించింది బీసీసీఐ. అయితే ఇక టి20 లలో రాణిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ను వన్డే ఫార్మాట్లో  రాణిస్తున్న ఇషాన్ కిషన్లకు టెస్ట్ జట్టులో చోటు కల్పించింది అని చెప్పాలి.. ఇక్కడే అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి దేశవాళి క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న సర్పరాజు ఖాన్ ను పక్కన పెట్టడం పై నిప్పులు చెరుగుతున్నారు   అభిమానులు.



 దేశవాళి క్రికెట్లో దుమ్ము రేపుతున్న సర్ఫరాజ్ ఖాన్ ను కాదని సూర్య కుమార్ ను జట్టులోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ విమర్శలు చేస్తున్నారు.  రెండేళ్లలో కూడా సర్పరాజ్ దేశవాళీ  క్రికెట్లో ఎంత నిలకడగా రాణిస్తూ పరుగులు చేస్తున్నాడో అందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అలాంటి ప్లేయర్ ను జట్టులో సెలెక్ట్ చేయకపోవడం అంటే అది ఇక రంజీ క్రికెట్ ను అవమానించడమే అవుతుంది. మరోసారి అతని పట్ల సెలెక్షన్ కమిటీ కక్షపూరితంగా వ్యవహరించింది. భారత జట్టులోకి రావాలంటే రంజి పరుగులు సరిపోవ.. ప్రతి మ్యాచ్లో 500 పరుగులు కొట్టాలా.. సూర్య కుమార్ ఇషాన్ కిషన్లు సర్పరాజ్ కంటే ఎందులో గొప్ప అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: