
ఇక మరి కొంతమంది ఇక ఉద్యోగం ఇచ్చి చేరా చేరదీసిన వారి విషయంలో సైతం మోసాలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పాలి
ఇక ఇటీవల టీమిండియా స్టార్ ఫేసర్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఏకంగా ఒక వ్యక్తిని నమ్మి స్నేహితుడు అని చేరదీసి ఇక తన దగ్గర ఉద్యోగం ఇచ్చినందుకు.. చివరికి అతనికే టోకరా వేశాడు సదరు కేటుగాడు. ఇలా స్నేహితుడు చేతిలో మోసపోయిన స్టార్ క్రికెటర్ ఎవరో కాదు ఉమేష్ యాదవ్. నాగపూర్ కు చెందిన శైలేష్ అనే వ్యక్తి ఉమేష్ యాదవ్ కు స్నేహితుడు. అయితే అతనికి ఉద్యోగం లేకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గమనించిన ఉమేష్ యాదవ్ ఏకంగా అతనికి తన మేనేజర్ గా ఉద్యోగాన్ని ఇచ్చాడు. 2014లో ఇలా మేనేజర్ గా నియమించుకున్నాడు. శైలష్ ఎంతో నమ్మకంగా పనిచేయడంతో ఇక ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అతనికి అప్పగించాడు ఉమేష్ యాదవ్. అయితే ఇటీవల 44 లక్షలకే ఒక మంచి ఫ్లాట్ ఇప్పిస్తాను అంటూ నమ్మబలికి చివరికి ఉమేష్ యాదవ్ డబ్బులతో.. తన పేరు మీదటే ఆ ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు శైలేష్ డబ్బులు ఇవ్వాలని అడగగా నిరాకరించాడు. దీంతో ఉమేష్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు.