
ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన ఏ వార్త తేర మీదికి వచ్చినా కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల సర్పరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ తన జీవితంలో తన కొడుకుతో ఎదురైన ఎమోషనల్ ఘటన గురించి మీడియాతో పంచుకున్నాడు. హృదయాన్ని కదిలించే ఈ సన్నివేశంలో సర్పరాజు తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు అతని తండ్రి నౌషద్ ఖాన్. సర్పరాజ్, సచిన్ తనయుడు అర్జున్ జూనియర్ లెవెల్ నుంచి ముంబై తరఫున కలిసి ఆడుతూ ఉండేవారు. అయితే సచిన్ ధనవంతుడు కావడంతో ఇక అతని కొడుకు ఎలాంటి లోటు ఉండేది కాదు. అన్ని రకాల సదుపాయాలు ఉండేవి.
కానీ సర్పరాజు తండ్రి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు కావడంతో అంతంత మాత్రం సదుపాయాలతోనే సర్పరాజ్ ఖాన్ క్రికెట్ ఆడాల్సి వచ్చింది. అయితే ఓ రోజు సర్పరాజ్ ఖాన్ తన తండ్రి నౌషద్ దగ్గరికి వెళ్లి... నాన్న అర్జున్ ఎంత అదృష్టవంతుడు. అతని దగ్గర కార్లు ఐపాంట్స్ అన్ని ఉన్నాయి అంటూ చెప్పడంతో ఇక అతని తండ్రి నౌషద్ నోట మాట రాలేదట. నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడట. ఇక ఆ తర్వాత కాసేపటికే సర్పరాజ్ ఖాన్ తన తండ్రి దగ్గరికి వచ్చి అర్జున్ కంటే నేను అదృష్టవంతుడిని నాన్న.. ఎందుకంటే నా తండ్రి నాతో రోజంతా గడుపుతాడు. కానీ అర్జున్ తండ్రి అతనితో ఎక్కువ సమయం గడపలేడు అంటూ మెచ్యూర్ గా మాట్లాడటంతో ఇక నౌషత్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. చిన్నతనం నుంచే తన కొడుకు ఇంత పరిపక్వత్తగా ఆలోచిస్తున్నాడు అని మురిసిపోయాడట. ఈ విషయాన్ని ఓ పత్రికతో చెప్పుకొచ్చాడు నౌషద్ ఖాన్.