
అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల భారత్ శ్రీలంక మధ్య సూపర్ సిక్స్ లో భాగంగా మ్యాచ్ జరిగింది. శ్రీలంక పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా జట్టు. అయితే అంతకుముందు అటు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో మాత్రం ఓడిపోవడంతో టీం ఇండియాకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. కానీ ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేయగలిగింది.
దీన్నిబట్టి అటు భారత బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటింగ్ విభాగం పూర్తిగా పేక మేడల కూలిపోయింది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఇక శ్రీలంక బాటర్లలో అత్యధిక స్కోరు కెప్టెన్ చేసిన 25 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఆ తర్వాత స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 7.2 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. అంటే కేవలం 44 బంతుల్లోనే ప్రత్యర్థిని ఓడించింది అని చెప్పాలి. ఓపెనర్లు షిఫాలీ 15, శ్వేత 13.. త్వరగానే ఒకటైనప్పటికీ.. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సౌమ్య 28 పరుగులతో నాట్ అవుట్ గా నిలవడంతో చివరికి శ్రీలంకను మట్టి కరిపించింది.