
సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో మరోసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో బరిలోకి దిగింది టీం ఇండియా జట్టు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్ల జట్టు అద్భుతంగా ఆడుతుంది అనుకున్నప్పటికీ ఇక మొదటి టి20 మ్యాచ్ లోనే టీమిండియా వరుస విజయాలకు చెక్ పడింది అని చెప్పాలి. బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ అదరగొట్టడంతో చివరికి టీమిండియా మొదటి టి20 మ్యాచ్ లో ఓడిపోయింది.
అయితే మొదటి టి20 మ్యాచ్ లో ఓడి పోయినప్పటికీ అభిమానులు మాత్రం ఒక విషయంలో కాస్త ఆనందంగానే ఉన్నారు అనేది తెలుస్తుంది. అదేంటి మ్యాచ్ ఓడిపోతే టీమ్ ఇండియా అభిమానులు ఆనందంగా ఉండటమేంటి అని అనుకుంటున్నారా.. భారత్ న్యూజిలాండ్ మధ్య జార్ఖండ్ లోని రాంచి స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ చూసేందుకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని హాజరయ్యాడు. తన భార్య సాక్షితో కలిసి మ్యాచ్ వీక్షించాడు. ఇక ధోని ఫోటోలు వైరల్ గా మారిపోయాయి. అయితే ఇక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఇక ధోని మ్యాచ్ చూసేందుకు రావడంతో ఇక అతన్ని చూస్తూ అభిమానులు మురిసిపోయారు అని.