
అలాంటి మిస్టర్ కూల్ పేరు టాప్ 5 కెప్టెన్ల లిస్టులో లేకపోవడం ఏమిటి అనే సందేహం అందరికీ వస్తుంది కదూ. అవును, ఆ విషయం ఏమిటో ఇపుడు చూద్దాము. ఇకపోతే కెప్టెన్ సామర్ధ్యం అనేది అతని జట్టు గెలిచిన మ్యాచ్‌లు, టోర్నమెంట్‌ల సంఖ్యను బట్టి మనవాళ్ళు నిర్ణయిస్తూ వుంటారు. ఈ క్రమంలోనే మొదటి 75 మ్యాచ్‌లలో 50 లేదా 50 కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన 5గురు కెప్టెన్సీ లిస్ట్ ఒకటి వెలువడింది. అందులో ఇండియా తరుపున ఇద్దరు ఉండగా అందులో ధోని పేరు లేకపోవడం కొసమెరుపు. అందులో మొదటి వ్యక్తి రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా.) ఇతగాడు 75 మ్యాచ్‌లు అడగా 59 మ్యాచ్‌లు గెలిచిన మొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
ఆ తరువాతి రికార్డ్ మన ఇండియన్ ఆటగాడు రోహిత్ శర్మ పేరున వుంది. ఇతగాడు కెప్టెన్‌గా 75 మ్యాచ్‌లు ఆడగా 58 మ్యాచ్‌లు గెలిచి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండడం గమనార్హం. ఈ జాబితాలో ఇక మూడవ స్థానంలో వున్నది విరాట్ కోహ్లీ. ఇతగాడు మొదటి 75 మ్యాచ్‌లలో 54 గెలిచి, ఈ లిస్టులో 3వ స్థానంలో రాణించడం విశేషం. అలా మన భరత్ తరుపున వీరిద్దరూ తమ పేర్లను లిఖించుకున్నారు. ఇక వీరి తరువాత సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్థాన్) వున్నాడు. ఇతగాడు కెప్టెన్‌గా తన మొదటి 75 మ్యాచ్‌లలో 53 గెలిచి, ఈ లిస్టులో 4వ స్థానంలో నిలిచాడు. ఇక చివరగా దక్షిణాఫ్రికా ఆటగాడు హాన్సీ క్రోంజే కెప్టెన్‌గా మొదటి 75 మ్యాచ్‌లలో 52 గెలిచిన క్రోంజే.. ఈ లిస్టులో 5వ స్థానంలో నిలిచాడు.