
ఇక ఈ టెస్ట్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే రెండు మ్యాచ్లలో విజయాలు సాధించిన టీమిండియా జట్టు మూడో మ్యాచ్లో విజయం సాధించింది అంటే చాలు ఇక ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో మూడో మ్యాచ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగింది టీమిండియా. ఆ జట్టు ఇక పేలవ ప్రదర్శన చేస్తున్న కేఎల్ రాహుల్ ని పక్కన పెట్టి శుభమన్ గిల్ కు ఓపెనర్ గా అవకాశం ఇచ్చింది అని చెప్పాలి.
అయితే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గేలవాలి ఇలాంటి సమయంలో ప్రస్తుతం మూడో టెస్ట్ లో అటు ఆస్ట్రేలియా పట్టు బిగిస్తుంది అన్నది తెలుస్తుంది.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు 44 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాలు పడిపోయింది. కెప్టెన్ లోహిత్ శర్మ 12 పరుగుల వద్ద కుహనెమన్ బౌలింగ్ లోనే ఔట్ అవ్వ్వగా.. గిల్ క్రికెట్ కూడా 21 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. ఇక పూజార ఎప్పటిలాగానే మరోసారి నిరాశపరిచాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు అని చెప్పాలి. ఇక రవీంద్ర జడేజా అయినా జట్టును ఆదుకుంటాడు అనుకుంటే నాలుగు పరుగుల వద్ద లియోన్ కే చిక్కాడు. ఇలా 44 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా. శ్రేయస్ అయ్యర్ సైతం కుహునే మాన్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. కాగా ప్రస్తుతం క్రీజులో కోహ్లీ కె.ఎస్ భరత్ ఉన్నారు అని చెప్పాలి.