దాదాపు మూడేళ్లపాటు ఫామ్ కోల్పోయి విరాట్ కోహ్లీ ఎంతలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం.. సింగిల్ డిజిట్ స్కోర్కె వికెట్ కోల్పోవడం లాంటివి జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కోహ్లీ విషయంలో ఇక ఎంతోమంది విమర్శలు కూడా గుప్పించారు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ పని అయిపోయిందని అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. అయితే ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడిన విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు అని చెప్పాలి. ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసి మళ్లీ తాను ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని నిరూపించాడు. ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే సెంచరీల మోత మోగించి ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పాలి. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో కూడా అదే ఫామ్ ని కొనసాగిస్తాడు అని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మాత్రం విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫామ్ టీమిండియా అభిమానులు అందరిని కూడా ఆందోళన కలిగిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో గత 20 ఇన్నింగ్స్ లలో కూడా కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇక ఇలా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక కోహ్లీ సెంచరీ చేయక 1195 రోజులు అవుతుంది 41 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ సెంచరీ కొట్టలేదు. చివరగా 2019లో పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాడు. అప్పటి నుంచి అతని అవేరేజ్ 25.70 మాత్రమే ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: