
అదే సమయంలో ఇక జట్టు లో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రా ఇప్పటికీ జట్టులోకి రాలేని పరిస్థితి నెలకొంది. అయితే మొన్నటికీ మొన్న గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఇక ఆ తర్వాత మాత్రం అందుబాటులోకి వచ్చాడు. కానీ అంతలోనే మరోసారి శ్రేయస్ అయ్యర్ గాయం బారిన పడ్డాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా కు మరో ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ భారత జట్టులోకి రావడంతో జట్టు పటిష్టంగా మారిందని అందరూ భావించారు. కానీ ఇటీవల నాలుగో టెస్ట్ సందర్భంగా మరోసారి అతను గాయం బారిన పడ్డాడు. అయితే ఇటీవలే మొదటి ఇన్నింగ్స్ లో అతను కనీసం బ్యాటింగ్ చేయడానికి కూడా రాలేదు అని చెప్పాలి.
అయితే తీవ్రమైన వెన్నునొప్పి కారణంగానే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు దూరంగా ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ అతని గాయం తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి స్కానింగ్ చేయించింది అని సమాచారం. కానీ శ్రేయస్ అయ్యర్ గాయం పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు బీసీసీఐ. అయితే ఆస్ట్రేలియా తో రెండో ఇన్నింగ్స్ సందర్భంగాను అతను ఫీల్డింగ్ కు రాలేదు అని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఇక అతను ఈ టెస్ట్ మ్యాచ్ పూర్తయ్యేంతవరకు జట్టులో కనిపించడం కష్టమే అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా ఈనెల 17 నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరగబోయే వన్డే సిరీస్ లో కూడా అతనువెన్నునొప్పి గాయం కారణంగా దూరం కాబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతని స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.