
కొంత మంది ఎంత చదివినప్పటికీ గుర్తుండగా చివరికి పరీక్షల సమయం లో ఏం సమాధానాలు రాయాలో తెలియక ఫెయిల్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొంత మంది విద్యార్థులు ఇలా పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి అయినా చదవడం ప్రారంభిస్తే.. మరి కొంతమంది మాత్రం ఎలాగోలా కాపీ కొట్టి పాస్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇన్విజిలేటర్ గా వచ్చిన వ్యక్తిని మస్కా కొట్టి సరికొత్త రీతిలో కాపీ కొట్టడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాం. కొన్ని కొన్ని సార్లు ఇక విద్యార్థులు కాపీ కొట్టే తీరు చూసి అటు అందరూ షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో ప్రస్తుతం విద్యార్థులు కాపీ కొట్టేందుకు ఎంచుకుంటున్న మార్గాలు అందరిని ఆశ్చర్యానికి లోన చేస్తున్నాయి. వినూత్న రీతిలో కాపీలు కొడుతూ దొరికి పోయారు విద్యార్థులు. ఒక విద్యార్థి చేతులపై సమాధానాలు రాసుకొని టీ షర్ట్ వేసుకుని రాగా.. ఇక ఇన్విజిలేటర్ గుర్తించారు. ఇక మరొక విద్యార్థి ఏకంగా చున్నీపై పెన్నుతో ఆన్సర్లు రాసుకొచ్చింది అని చెప్పాలి. అయితే ఇక ఇలా కాపీ కొడుతున్న ఇద్దరు విద్యార్థులను పట్టుకున్న ఇన్విజిలేటర్లు ఇక ఇద్దరిని కూడా డిబార్ చేశారు అని చెప్పాలి.