సాదరణంగా క్రికెట్ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడు తమకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు బంతిని వేగంగా వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ అనే విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఫాస్ట్ బౌలర్లు సంధించే వేగానికి బ్యాట్స్మెన్లు వనికి పోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక వారి బౌలింగ్లో రన్స్ రాబట్టడం కాదు కేవలం గాయాలు కాకుండా చూసుకుంటే బెటర్ అని కేవలం డిఫెన్స్ ఆడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇప్పుడు వరకు ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లు తమ స్పీడ్ బౌలింగ్ తో రికార్డులు సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇటీవల న్యూజిలాండ్ బౌలర్ ఆడం మిల్నే సైతం ఇలాంటి బౌలింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు.


 ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఆడం మిల్నే పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి.  అత్యంత వేగంగా బంతులను సంధిస్తూ ఇక ప్రత్యర్ధులను వనికించడంలో  అతను దిట్ట అని చెప్పాలి.ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్,  శ్రీలంక మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్ లో ఆడం మిల్నే తన బౌలింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఏకంగా ప్రత్యర్థులను వనికించాడు. నాలుగు ఓవర్ల కోట పూర్తి చేసిన ఆడం మిల్నే 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు కీలకమైన సమయంలో వికెట్లు కూల్చాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే లంక బ్యాటింగ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా శాసించాడు.



 కాగా తన అద్భుతమైన బౌలింగ్ తో లంక బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఆడం మిల్నే.. సూపర్ డెలివరీతో పాతూమ్ నిస్సాంక బ్యాట్ ను విరగొట్టిన తీరు మ్యాచ్ మొత్తానికి కూడా హైలెట్ గా మారిపోయింది అని చెప్పాలి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లంకకు ఆరంభంలోనే తన ఫేస్ రుచి చూపించాడు ఆడం మిల్నే.  తొలి ఓవర్ లోనే మిల్నే దెబ్బకు పాతూన్ నీశాంక  బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇక న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్ లో 5 వికెట్లతో అదరగొట్టిన ఆడం మిల్నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: